ఆర్. ఆర్. ఆర్ ప్రీరిలీజ్ ఈవెంట్ సీక్రెట్స్ ఇవేనట...!

murali krishna
టాలీవుడ్ దర్శక ధీరుడు ఎస్ ఎస్ రాజమౌళి బాహుబలి సినిమాతో తెలుగు సినిమా ఖ్యాతిని ప్రపంచస్థాయికి తీసుకెళ్లి తెలుగు సినిమా అంటే ఏమిటో నిరూపించారని అందరికి తెలుసు.
ఇలా బాహుబలి తర్వాత రాజమౌళి దర్శకత్వంలో వస్తున్నటువంటి భారీ బడ్జెట్ పాన్ ఇండియా మూవీ ఆర్‌ఆర్‌ఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని తెలుస్తుంది.ఈ సినిమా షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకుని జనవరి 7వ తేదీన ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధమైందని సమాచారం. ఇక ఇప్పటి నుంచి చిత్రబృందం పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తోందట. ఆర్‌ఆర్‌ఆర్ చిత్ర బృందం ఇప్పటికే ముంబై మరియు చెన్నై, బెంగళూరు అలాగే హైదరాబాద్ వంటి నగరాల్లో ప్రెస్ మీట్ నిర్వహించి సినిమా గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను వెల్లడించారట.ఇదిలా ఉండగా ముంబైలో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలను ఎంతో ఘనంగా నిర్వహించినట్లు సమాచారం. సాధారణంగా ఏ సినిమా ప్రీ రిలీజ్ వేడుక అయిన లైవ్ ద్వారా టెలికాస్ట్ చేస్తారని తెలుస్తుంది.కానీ ఈ సినిమా విషయంలో అలా కాకుండా లైవ్ టెలికాస్ట్ కాకుండా ప్రీ రిలీజ్ వేడుకను షూట్ చేసి ప్రత్యేకంగా టీవీలో ప్రసారం చేస్తున్నట్లు సమాచారం.
అదే విధంగా ఈ ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథులుగా సల్మాన్ ఖాన్ మరియు కరణ్ జోహార్ వంటివారు పాల్గొన్నట్లు సమాచారం.ఇకపోతే కేవలం ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు మాత్రమే నిర్మాత డి.వి.వి.దానయ్య 10 కోట్ల రూపాయలు ఖర్చు చేసినట్లు సమాచారం.ఇక ఈ సినిమా కోసం డి.వి.వి.దానయ్య ఏకంగా 450 కోట్ల బడ్జెట్ కేటాయించి ఈ చిత్రాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారట. ఏది ఏమైనా ఒక సినిమా రిలీజ్ వేడుక మొట్టమొదటిసారి లైవ్ లో కాకుండా టీవీలో ప్రత్యేకంగా ప్రసారం చేయడం వెనుక కూడా జక్కన్న మాస్టర్ ప్లాన్ ఉందనే చెప్పవచ్చు.మరీ చూడాలి ఈ సినిమా ఎన్ని రికార్డ్స్ కొల్లగొడుతుందో...!

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: