ఆర్. ఆర్. ఆర్ విషయంలో అక్కడ కుట్ర జరుగుతుందా..!

frame ఆర్. ఆర్. ఆర్ విషయంలో అక్కడ కుట్ర జరుగుతుందా..!

murali krishna
నిజమే ఎలాంటి అనుమానం లేదట.ఇండియాలోనే ప్రస్తుతం అత్యంత భారీ మల్టీస్టారర్ అంటే 'ఆర్ఆర్ఆర్' సినిమానే అని తెలుస్తుంది.

ఈ సినిమా కోసం తెలుగు ప్రేక్షకులు బాగా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారట.పైగా బజ్ ఉన్న పాన్ ఇండియా సినిమా ఇదని తెలుస్తుంది.. అలాగే పాన్ ఇండియా సినిమా రేంజ్ లో ఈ సినిమాకు ఆదరణ కూడా లభిస్తుందట.హిందీలో కూడా ఆర్ఆర్ఆర్ కు బాగా ప్రాధాన్యత ఇస్తున్నారని సమాచారం.

కానీ తమిళంలో మాత్రం ఈ చిత్రాన్ని పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తుంది.లోపం సినిమాలో ఉందా ? లేక తమిళంలో చేస్తోన్న ప్రమోషన్స్ లో ఉందా ? అనేది ప్రస్తుతం రాజమౌళి టీమ్ చర్చిస్తోందట.. నిజానికి బాహుబలి విషయంలో ఇలా లేదని తెలుస్తుంది.. తమిళ వాళ్ళు కూడా ఆ సినిమాను అక్కున చేర్చుకుని బాగా ఆదరించారట.కానీ ఆర్ఆర్ఆర్ విషయంలో అందుకు పూర్తి విరుద్ధంగా జరుగుతూ ఉండటం ఆశ్చర్యకర విషయమేనని తెలుస్తుంది.

ఈ సినిమా తమిళ వెర్షన్ కి సంబంధించి ఏ టీజర్ వదిలినా మరియు ఏ సాంగ్ వదిలినా పాజిటివ్ వైబ్స్ కంటే ఎక్కువగా నెగిటివ్ ప్రచారమే జరిగిందట.. ఆ ప్రచారానికి ముఖ్య కారణం… కొందరు తమిళ హీరోల ఇగోలు మరియు అసూయలే కారణం అని తెలుస్తోంది. తమిళంలో కూడా స్టార్స్ మధ్య పెద్దగా ఐక్యత ఉండదని కాకపోతే ఆర్ఆర్ఆర్ విషయంలో మాత్రం తమిళ ఇండస్ట్రీ మొత్తం చాలా ఐక్యంగా ఉందట.

బాహుబలి కారణంగా తమిళ ఇండస్ట్రీ చాలా విమర్శలు ఎదుర్కొందట .ఇప్పుడు ఆర్ఆర్ఆర్ రూపంలో మరిన్ని విమర్శలు ఎదుర్కోవాల్సి వస్తోందేమో అని తమిళ హీరోల భయపడుతున్నారట. పైగా తమకు మరో ఇద్దరు హీరోలు పోటీ అవుతారని పైగా టాలెంట్ విషయంలో ఎన్టీఆర్ తో పోటీ పడటం కుదిరే పని కాదని అనుకుంటున్నారట.అందుకే  తమిళంలో ఆర్ఆర్ఆర్ ను హిట్ కాకుండా చూస్తున్నారట.


జనవరి 7వ తేదీన విడుదల కాబోతున్న 'ఆర్ఆర్ఆర్' సినిమాకి తమిళంలో ఓపెనింగ్స్ వస్తాయా ? రావా ? అనేది ఇప్పుడు మేకర్స్ పెద్ద టెన్షన్ అయిపోయిందని తెలుస్తుంది.. ఏది ఏమైనా 'ఆర్ఆర్ఆర్' పైనే అందరి చూపులు ఉన్నాయని సమాచారం.. సినిమా అద్భుతం అనే టాక్ వస్తే.. సినిమాకి తమిళంలో కూడా ఊపు రావొచ్చని తెలుస్తుంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: