రాజ‌మౌళి మ‌హాభార‌త్‌కు ఎన్ని భాగాలుంటాయి..?

            ద‌ర్శ‌క‌ ధీరుడు రాజ‌మౌళి ఘ‌న‌త‌ గురించి ఇప్పుడు ప్ర‌త్యేకంగా చెప్పుకోవాల్సిన అవ‌స‌రం లేదు. అత‌డేమిటో అత‌డు తెర‌కెక్కించిన సినిమాలే చెపుతాయి. బాహుబ‌లితో తెలుగు సినిమాను సాంకేతికంగా ఒకేసారి ప‌దిమెట్లు ఎక్కించ‌డ‌మే కాదు..టాలీవుడ్‌ మార్కెట్‌ను క‌మ‌ర్షియ‌ల్‌గా బాలీవుడ్ సైతం న‌మ్మ‌లేని విధంగా  ఒక్క‌సారిగా ప‌దింత‌లు పెంచేసిన వెండితెర మాంత్రికుడు అత‌డు. ఒక్క తెలుగు ప‌రిశ్ర‌మ మాత్ర‌మే కాదు. ప్రాంతీయ భాషా హీరోలు  మొద‌లుకొని.. బాలీవుడ్‌ సూప‌ర్‌స్టార్లు సైతం త‌న ద‌ర్శ‌క‌త్వంలో ఒక్క సినిమాలోనైనా న‌టించాల‌ని క‌ల‌లు క‌నే స్టేచ‌ర్ అత‌డిది.  
               
           బాహుబ‌లి త‌రువాత రాజమౌళి తార‌క్‌, చెర్రీల‌తో ప్ర‌తిష్ఠాత్మ‌కంగా తెర‌కెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం మ‌రికొద్ది రోజుల్లోనే ప్రేక్ష‌కుల ముందుకు వచ్చేందుకు సిద్ధ‌మ‌వుతోంది. ఆ త‌రువాత మ‌హేష్‌తో చిత్రం మొద‌లుపెట్టే అవ‌కాశ‌ముంది. ఒక సినిమా పూర్త‌య్యేంత‌వ‌ర‌కు మ‌రో సినిమా గురించి ఆలోచించ‌డం అల‌వాటు లేని రాజ‌మౌళి క‌ల‌ల ప్రాజెక్టుగా గ‌తంలో చెప్పిన మ‌హాభార‌తం గురించి మ‌రోసారి చ‌ర్చ‌లు మొద‌ల‌వుతున్నాయి. ఇటీవ‌లికాలంలో దీనిపై రాజ‌మౌళి మాట్లాడిన దాఖ‌లాలు లేవు. అయితే ఆ ప్రాజెక్టును ప‌క్క‌న పెట్టిన‌ట్టు కూడా రాజ‌మౌళి ఎక్క‌డా చెప్ప‌లేదు. మ‌హాభారత ఇతిహాస గాథకు ఉన్న ప‌రిధి అత్యంత విస్తృతం. ఇందులో ఒక్కో పాత్ర‌ను ప్ర‌ధాన క‌థాంశంగా తీసుకుని వ‌చ్చిన చిత్రాలే భార‌తీయ భాష‌ల్లో కొన్ని ప‌దుల సంఖ్య‌లో ఉన్నాయి. మొత్తంగా చూస్తే కొన్ని వంద‌ల సినిమాలు వ‌చ్చుంటాయి. ఇందులో అత్య‌ధిక శాతం విజ‌య‌వంత‌మైన చిత్రాలే. అంతేకాదు.. బుల్లి తెర‌పై సీరియ‌ల్‌గా నూ మ‌హాభార‌తం ప్ర‌జ‌ల‌ముందుకు వ‌చ్చి ప్రేక్ష‌కుల‌ను విశేషంగా ఆక‌ట్టుకుంది. ఎన్నిసార్లు తీసినా, చూసినా మ‌హాభార‌తంలోని పాత్ర‌లు నిత్య నూత‌న‌మే. అందుకేనేమో రాజ‌మౌళి కూడా త‌న డ్రీమ్ ప్రాజెక్టుగా దీనినే ఎంచుకుంది. అయితే ఈ క‌థ‌కున్న విస్తృతి రీత్యా దీనిని ఒకే భాగంగా తీయ‌డం దాదాపు అసాధ్యం. ఒక‌సారి ఈ ప్రాజెక్టును మొద‌లుపెడితే దీని సీక్వెల్ చిత్రాలు ఎన్నుంటాయో చెప్ప‌లేం. అందుకేనేమో రాజ‌మౌళి త‌న క‌మిట్‌మెంట్ల‌న్నీ పూర్త‌య్యాక ఫైన‌ల్‌గానే ఈ ప్రాజెక్టు మొద‌లుపెడ‌తాన‌ని, దీనికి ఎన్నేళ్లు ప‌డుతుందో తెలియ‌ద‌ని గ‌తంలోనే స్ప‌ష్టంగా చెప్పాడు. మ‌రి మ‌హేష్ సినిమా త‌రువాత రాజ‌మౌళి ఈ ప్రాజెక్టుపైనే దృష్టిసారిస్తాడా లేక మ‌రికొంత స‌మ‌యం తీసుకుంటాడో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: