బాలీవుడ్ లో పాగా వేయనున్న చెర్రీ... ?

VAMSI
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన తాజా చిత్రం "ఆర్ ఆర్ ఆర్" 2022 జనవరి 7 న విడుదల కానున్న విషయం తెలిసిందే. ఈ పాన్ ఇండియా మూవీ కోసం అటు మెగా ఫ్యాన్స్ మరోవైపు నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. కాగా చెర్రీ ఇపుడు 'ఆచార్య' సినిమాతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. మెగాస్టార్ చిరంజీవి , చెర్రీ ల మల్టీ కాంబినేషన్ లో  తెరకెక్కుతున్న ఈ మూవీ మెగా ఆడియన్స్ కి చాలా చాలా స్పెషల్. ప్రస్తుతం షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ మూవీ వచ్చే ఏడాది 2022 ఫిబ్రవరి 4 వ తేదీన విడుదల కానుంది.

ఈ విధంగా చెర్రీ వరుసగా మల్టీస్టారర్ చిత్రాలు చేస్తున్న నేపథ్యంలో ఇపుడు మరో మల్టీ స్టారర్ సినిమాకి చెర్రీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అందులోనూ  ఈ సారి బాలీవుడ్ స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్నాడు చెర్రీ అనడంతో ఈ వార్త మరింత ఆసక్తికరంగా మారింది. అవును ప్రస్తుత సమాచారం మేరకు తాజాగా బాలీవుడ్ హీరోతో కలిసి నటించడానికి ఓకే చేసినట్లు తెలుస్తోంది. యాక్షన్ థ్రిల్లర్ ఎంటర్టైన్ గా కొనసాగే ఈ సినిమాలో రామ్ చరణ్ తో పాటుగా బాలీవుడ్ యంగ్ హీరో ఒకరు చేస్తున్నట్లు సమాచారం. ఇద్దరు కూడా లీడ్ రోల్స్ చేస్తున్నారట.

ఇప్పటికే పాన్ ఇండియా హీరోగా మారిన చెర్రీకి హిందీ లో మంచి పాపులారిటీ ఉంది. "ఆర్ ఆర్ ఆర్" మూవీ కోసం బాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఎంతగానో ఎదురుచూస్తున్న నేపథ్యంలో ఈ వార్త అందరికీ మరో ట్రీట్ అనే చెప్పాలి. అయితే ఇందులో ఎంత నిజం ఉందో తెలియాలంటే బాలీవుడ్ వర్గాల నుండి అధికారిక ప్రకటన వచ్చే వరకు ఆగాల్సిందే.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: