బిగ్ బాస్ చరిత్రలోనే అది సంచలన రికార్డ్..అంత వాళ్ల పుణ్యమేగా..!!

frame బిగ్ బాస్ చరిత్రలోనే అది సంచలన రికార్డ్..అంత వాళ్ల పుణ్యమేగా..!!

VUYYURU SUBHASH
సన్నీ, ఒక్కప్పుడు ఈ పేరు పెద్దగా ఎక్కువ మందికి తెలియకపోవచ్చు. వీజే గా, రిపోర్టర్ గా, సీరియల్ ఆర్టిస్ట్ గా..మాత్రమే కొందరికి తెలిసి ఉండచ్చు. కానీ గత కొన్ని రోజులుగా ఈ పేరు రెండు తెలుగు రాష్ట్రాలల్లో మారుమ్రోగిపోతుంది. తెలుగు టెలివిజన్ చరొత్రలోనే ప్రేక్షకులను ఎంతగానో అలరిస్తూ వస్తున్న బిగ్ బాస్ షో గురించి ఎంత చెప్పినా తక్కువే. ఇప్పటికే నాలుగు సీజన్ల ను కంప్లీట్ చేసుకున్న బిగ్ బాస్ నిన్నటి తో సీజన్ 5 కి కూడా ఎండ్ కార్డ్ పెట్టేసింది. షో రెగ్యులర్ గా ఫాలో అవుతున్న వాళ్లు అప్పుడే బిగ్ బాస్ అయిపోయిందా అంటున్నారు. చూస్తూ చూస్తూనే 105 రోజులు గడిచిపోయాయి అంటూ చెప్పుతున్నారు.

ప్రతి సీజన్ లో లాగనే ఈ సారి బిగ్ బాస్ షో లో ఎన్నో ప్రేమలు, ద్వేషాలు, గొడవలు, అలకలు,  నవ్వులతో సాగిపోయింది. ఇక పెద్దగా చెప్పుకొతగిన సెలబ్రిటీలు ఎవ్వరు లేకపోవడంతో షో స్టార్ట్ అయిన మొదట్లో ఈ సీజన్ కి టిఆర్పి రేటు చాలా తక్కువ వచ్చాయి..కానీ పోను పోను సన్నీ కామెడీ, సిరి-షణ్ముఖ్ రొమాన్స్, కాజల్-యానీ మాస్టర్ గొడవలు, శ్రీరామ చంద్ర పాటలు.. వీకెండ్ నాగార్జున ఆటలతో షో పర్లేదు అనిపించింది. కానీ బిగ్ బాస్ నిర్వాహకులు మాత్రం గ్రాండ్ ఫినాలే ని బాగా గ్రాండ్ గా ప్లాన్ చేసి ఘనంగా నిర్వహించారు.

ఏకంగా బాలీవుడ్ నటులను గెస్ట్ లు గా తీసుకొచ్చి కంటెస్టెంట్లకు ఊహించని షాక్ ఇచ్చారు. బిగ్ బాస్ షో టిఆర్పి పాత రికార్డులు బద్దలయ్యేలా ప్లాన్ చేశారు. ఈ మేరకు గ్రాండ్ ఫినాలే ఎపిసోడ్ లో స్టార్ సెలబ్రిటీస్ గెస్టు లతో షో కళకళలాడిపోయింది. ఇక్కడ మరో చెప్పుకొతగిన అంశం ఏమిటంటే ఇన్నీ సీజన్స్ లో ఇప్పటివరకూ ఎప్పుడు ఏ సీజన్లో కూడా ఇంతమంది గెస్ట్ లు ఫినాలే ఎపిసోడ్ కి రాలేదు.  ఫస్ట్ టైం ఇంతమంది గెస్ట్ లు ఈ గ్రాండ్ ఫినాలే కి రావడంతో షో మరింత అట్రాక్షన్ గా మారింది అనడంలో సందేహం లేదు. ముఖ్యంగా షోకి సెంటర్ ఆఫ్ అట్రాక్షన్  రాజమౌళి అనే చెప్పాలి. ఇక ఫైనల్ గా నాగార్జున టైటిల్ విన్నర్ ని అనౌన్స్ చేసి బై బై చెప్పేసాడు.  

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: