అయ్య బాబోయ్.. బిగ్ బాస్ తో సిరి అంత సంపాదించిందా?
ఈ క్రమంలోనే బిగ్ బాస్ హౌస్ లో ఎవరు ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నారు అనే దానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతూనే ఉంది. అయితే బిగ్ బాస్ హౌస్ లో లేడీ పటాకా గా పేరు తెచ్చుకుంది సిరి. అబ్బాయిలతో పోటీపడుతూ గేమ్స్ ఆడుతూ ఎన్నో విజయాలను కూడా అందుకుంది. సిరి కాన్ఫిడెన్స్ ప్రేక్షకులందరినీ ఎంతగానో ఆకర్షించింది. అయితే షణ్ముక్ తో ఫ్రెండ్షిప్ వళ్ళ అక్కడక్కడా కొంతమందికి చిరాకు తెప్పించింది. అయినప్పటికీ తన ఆటతీరుతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న సిరి తెలుగు బిగ్బాస్ చరిత్రలో టాప్ ఫైవ్ లో నిలిచిన ఏకైక లేడీ కంటెస్టెంట్ గా చరిత్ర సృష్టించింది.
ఇక గ్రాండ్ ఫినాలే లో కనీసం మూడవ స్థానంలో ఆయన నిలుస్తుంది అని అనుకున్నప్పటికీ చివరికి స్థానంతో సరిపెట్టుకుంది. ఎలిమినేట్ అయ్యి ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఈ క్రమంలోనే సిరి రెమ్యూనరేషన్ ఎంత తీసుకొని ఉంటుంది అన్నదానిపై ప్రస్తుతం ఆసక్తికర చర్చ జరుగుతోంది. అయితే సీరియల్ లోనూ వెబ్ సిరీస్ లను నటిస్తూ గుర్తింపు తెచ్చుకున్న సిరికి బిగ్ బాస్ హౌస్ లో వారానికి లక్షన్నర వరకు రెమ్యూనరేషన్ ఇస్తామని ముందుగానే డీల్ కుదుర్చుకున్నట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఒకవేళ ఇదే నిజమైతే ఇక 15 వారాలకు గానీ బిగ్ బాస్ నిర్వాహకుల నుంచి ఏకంగా 25 లక్షల వరకు పారితోషికం అందుకొని ఉంటుంది సిరి.