నాని ఋణం తీర్చుకుంటున్న బిగ్ బాస్ !

Seetha Sailaja
‘బిగ్ బాస్ సీజన్ 5’ ముగింపుకు వచ్చేసింది. వాస్తవానికి ‘బిగ్ బాస్ సీజన్ 5’ షో విన్నర్ ఎవరు అన్నది ఈషో నిర్వాహకులకు నిన్నటిరోజునే క్లారిటీ వచ్చినప్పటికీ బుల్లితెర ప్రేక్షకులకు మాత్రం దీనికి సంబంధించిన క్లారిటీ ఈరోజు సాయంత్రానికి వస్తుంది. వాస్తవానికి ఈ సీజన్ 5 ఎటువంటి సంచలనాలు అదేవిధంగా విమర్శలు లేకుండా సాదాసీదా గా ముగిసిపోతోంది.  


ఈసీజన్ 5 ఫైనల్ లిస్టుల పై పెద్దగా ఎవరికీ అంచనాలు లేకపోవడంతో ఫైనల్ విజేతగా ఎవరు వచ్చినా ఎవరు పట్టించుకునే స్థితిలో లేరు. దీనికితోడు ఈ సీజన్ 5ను హోస్ట్ చేసే విషయంలో నాగార్జున పెద్దగా ఈసారి రాణించలేకపోయాడు అన్న కామెంట్స్ చాలామంది దగ్గర నుండి రావడంతో వచ్చే సంవత్సరం ఈషోకు నాగ్ ఎంతవరకు మళ్ళీ హోస్ట్ గా వ్యవహరిస్తాడు అన్న విషయమై భిన్నాభిప్రాయాలు ఉన్నాయి.


ఈరోజు జరగబోతున్న ఫైనల్స్ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా నాని రాబోతున్నాడు. నానితో పాటు ‘శ్యామ్ సింగ్ రాయ్’ మూవీలో హీరోయిన్స్ గా నటించిన సాయి పల్లవి కృతి శెట్టి లు కూడ ఈరోజు కార్యక్రమంలో హడావిడి చేస్తూ పరోక్షంగా తమ మూవీని కూడ ప్రమోట్ చేసుకోబోతున్నారు. ‘బిగ్ బాస్ సీజన్ 2’ కార్యక్రమాన్ని నేచరల్ స్టార్ నాని హోస్ట్ చేసిన విషయం తెలిసిందే.


అప్పటి నుండి ‘బిగ్ బాస్’ నిర్వాహకులతో నానీకి మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. ఆ సాన్నిహిత్యంతో తిరిగి నాని ‘బిగ్ బాస్’ హౌస్ లోకి ఎంటర్ అవుతున్నాడు. వచ్చే సీజన్ కు రానా హోస్ట్ గా వ్యవహరిస్తాడు అన్న వార్తలు ఇప్పటి నుంచే హడావిడి చేస్తున్నాయి. ఇప్పటి వరకు జరిగిన ఈ 5 సీజన్స్ లో ఇదే డల్ షో అన్న అభిప్రాయం బుల్లితెర ప్రేక్షకులలో ఏర్పడింది. దీనితో ‘బిగ్ బాస్’ షో విన్నర్ ఎవరు అన్న బెట్టింగ్ లు ఊహాగానాలు లేకుండా సాదాసీదాగా ఈషో నేటితో సెలవు తీసుకుంటోంది..  





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: