సుడిగాలి సుదీర్ కావాలంటున్న ఫాన్స్.. వీళ్ళేమో వినిపించుకోరే?
మొన్నటి వరకు కేవలం అడపాదడపా సినిమాలు మాత్రమే చేసిన సుడిగాలి సుదీర్ ఇటీవలి కాలంలో టాలీవుడ్ లో హీరోగా కూడా ఎంట్రీ ఇచ్చాడు అన్న విషయం తెలిసిందే. ఇప్పుడు ఈటీవీ లో ప్రసారమయ్యే ప్రతి కార్యక్రమంలో కూడా సుడిగాలి సుదీర్ తనదైన శైలిలో అలరిస్తున్నాడు.. ఈ క్రమంలోనే ఈ టీవీలో ప్రసారమయ్యే డాన్స్ రియాలిటీ షో ఢీ లో కూడా టీం లీడర్ గా కొనసాగుతున్నాడు సుడిగాలి సుధీర్. ఇక తనదైన శైలిలో ఎంటర్టైన్మెంట్ అందిస్తూ బుల్లితెర ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తున్నాడు.
అయితే ఎన్నో సీజన్స్ నుంచి టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ వచ్చిన ఈ కార్యక్రమం 13వ సీజన్ ఇటీవలే ముగిసిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఇటీవల ఢీ 14వ తేదీ సన్ కూడా ప్రారంభమైంది. ఈ క్రమంలోనే ఈ సారి కూడా పక్క ఎంటర్టైన్మెంట్ ఉంటుందని భావించారు బుల్లితెర ప్రేక్షకులు. కానీ ఢీ షో మరింత హిట్ కావడానికి కారణమైన రష్మి సుడిగాలి సుదీర్ జోడి మాత్రం కనిపించకపోవడంతో నిరాశ చెందారు దీంతో ఇక ఈ కార్యక్రమానికి సంబంధించి ప్రోమో విడుదల అయినప్పుడల్లా సుడిగాలి సుదీర్ కావాలి అంటూ ఎన్నో కామెంట్లు కూడా పెడుతూ ఉండడం గమనార్హం. కానీ నిర్వాహకులు మాత్రం వినిపించుకోవడం లేదని ప్రేక్షకులు నిరాశ చెందుతున్నారు.