నందమూరి నట సింహం
బాలకృష్ణ హీరోగా గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఒక
సినిమా తెరకెక్కబోతున్న విషయం మనందరికీ తెలిసిందే, ఈ సినిమాలో
బాలకృష్ణ సరసన
శృతి హాసన్ హీరోయిన్ గా నటించబోతోంది, ఈ సినిమాను
movie MAKERS' target='_blank' title='మైత్రి
మూవీ మేకర్స్-గురించి లేటెస్ట్ అప్డేట్స్, ఫోటోలు, వీడియోల కొరకు వెంటనే క్లిక్ చేయండి. '>మైత్రి
మూవీ మేకర్స్ వారు నిర్మించనున్నారు. ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన
పూజా కార్యక్రమాలు కూడా కొన్ని రోజుల క్రితమే పూర్తి అయ్యాయి, ఈ
సినిమా ఎన్ బీకే 107 వర్కింగ్ టైటిల్ తో
పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకుంది. అయితే అప్పట్లో ఈ సినిమాకు జై
బాలయ్య అనే టైటిల్ ను చిత్ర బృందం ఫిక్స్ చేయనున్నట్టు సోషల్ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి, కాకపోతే ఇప్పటి వరకు ఈ వార్త పై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు.
ఇది ఇలా ఉంటే
బాలకృష్ణ ఈ
సినిమా లో డ్యూయల్ రోల్ లో కనిపించబోతున్నారని తెలుస్తోంది,
రాయలసీమ నేపథ్యం లో జరిగే ఈ కథ లో
బాలకృష్ణ ఫ్యాక్షన్
లీడర్ గాను, పవర్ఫుల్
పోలీస్ ఆఫీసర్ గాను కనిపించనున్నారని తెలుస్తుంది. అయితే ఇలాంటి రెండు పాత్రలు
బాలకృష్ణ కు పెద్ద కొత్తేమీ కాదు, ఇది వరకే ఎన్నో సినిమాల్లో ఫ్యాక్షన్
లీడర్ గా కనిపించి మెప్పించాడు, అలాగే
పోలీస్ ఆఫీసర్ గా కూడా కనిపించి అదరగొట్టాడు, అయితే ఈ రెండు పాత్రలను ఇప్పుడు గోపీచంద్ మలినేని సినిమాలో
బాలకృష్ణ చేయనున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉంటే ఈ సినిమాకు సంబంధించిన ఓ ఆసక్తికరమైన వార్త ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది.. ఈ
సినిమా లో
వరలక్ష్మి శరత్ కుమార్ నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్రలో కనిపించబోతున్నట్లు తెలుస్తుంది, ఆమె కోసం గోపీచంద్ మలినేని అదిరిపోయే క్యారెక్టర్ ను డిజైన్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి, ఇది వరకే
గోపిచంద్ మలినేని దర్శకత్వంలో వచ్చిన
క్రాక్ సినిమాలో కూడా
వరలక్ష్మి శరత్ కుమార్ కు అదిరిపోయే నెగిటివ్ రోల్ క్యారెక్టర్ ను ఈ దర్శకుడు డిజైన్ చేశాడు.