కమెడియన్ వడివేలుపై జయలలిత రివేంజ్.. సినీ కెరీర్ మొత్తం..!
సినీ ఇండస్ట్రీలో టాలెంట్‌తో పాటు అదృష్టం కూడా చాలా వరకు ఉండాలి. టాలెంట్ ఉన్నవాళ్లు ఇండస్ట్రీలో కమెడియన్లు, హీరోలు, హీరోయిన్లుగా కొనసాగుతున్నారు. అయితే హీరోలకంటే కమెడియన్‌గా రాణించడం చాలా కష్టం. చాలా మందికి టాలెంట్ ఉన్నా.. కొన్నిసార్లు వాళ్లు చేసిన చిన్న మిస్టేక్ వల్ల సినీ ఇండస్ట్రీ నుంచే బయటికి వెళ్లిపోవాల్సి వస్తుంది. అవకాశాలు లేక ఇండస్ట్రీకి దూరమవుతుంటారు. అలాంటి వారిలో తమిళ స్టార్ కమెడియన్ వడివేలు కూడా ఒక్కరు. స్టార్ కమెడియన్‌గా.. మంచి టాలెంట్ ఉన్న ఆర్టిస్టుగా పేరుతెచ్చుకున్నా.. వడివేలు ఇండస్ట్రీలో ఎక్కువ కాలం నిలవలేకపోయారు.
అయితే సినీ ఇండస్ట్రీలో చాలా మంది నటీనటులు కొన్ని విషయాల్లో రాజీ పడాల్సి వస్తుంటుంది. అవకాశాలు వచ్చినప్పుడు సరైన నిర్ణయాలు తీసుకోకపోతారు. అలా వారు తమ కెరీర్లో వెనుక పడిపోతుంటారు. అలాంటి పరిస్థితే కమెడియన్ వడివేలుకు జరిగింది. దీనికి కారణం వడివేలు చేసిన ఒక్క తప్పు. తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత.. తమిళనాట అమ్మగా పిలిచే జయలలితను ఎంతో మంది ఆదరిస్తుంటారు. ఆమెకు నచ్చితే ఎంత ప్రేమగా ఉంటారో.. నచ్చకపోతే అంతే కఠినంగా వ్యవహరిస్తారు.
వడివేలుకు తమిళ ఇండస్ట్రీలోనే కాదు టాలీవుడ్‌లోనూ అభిమానులు ఉన్నారు. ఆయన కామెడీ టైమింగ్ అంటే అందరికీ ఇష్టమే. ఒకప్పుడు ఇండస్ట్రీలో స్టార్ కమెడియన్‌గా కొనసాగినా.. ఇప్పుడు డల్‌గా ఉన్నారు. ఒకప్పుడు వడిలేలు పేరంటే తమిళనాట ఓ సంచలనం. ఆయన ఏ సినిమాలో నటిస్తున్నాడంటే.. ఫ్యాన్స్ ఎగబడి వెళ్లేవారు. ఒకే సంవత్సరంలో 30 నుంచి 40 సినిమాలు చేసేవాడు. అప్పట్లో ఈయన డేట్స్ దొరకడమే కష్టం. రజినీ లాంటి స్టార్ హీరోనే వడివేలు డేట్స్ తీసుకుని తన దగ్గరికి రమ్మనేవారంట.
సినీ ఇండస్ట్రీలో కెరీర్ మంచిగా ఉన్న సమయంలో వడివేలు పొలిటికల్ ఎంట్రీ ఇచ్చాడు. 2011 ఎన్నికల్లో డీఎంకే తరఫున ప్రచారం చేసిన వడివేలు.. జయలలిత, రజినీకాంత్‌కు వ్యతిరేకంగా కామెంట్స్ చేశారు. దీంతో వడివేలుకు తీవ్ర వ్యతిరేకత వచ్చింది. జయలలిత అధికారంలోకి వచ్చిన తర్వాత రీవెంజ్ తీసుకుంది. వడివేలు సినీ లైఫ్‌నే క్లోజ్ చేసింది. అలా వడివేలు తన సినీ కెరియర్ నాశనం చేసుకున్నారు.