జాడలేని సుకుమార్ ఆశ్చర్యపోతున్న ఇండస్ట్రీ వర్గాలు !

Seetha Sailaja
‘పుష్ప’ మూవీ విషయంలో అల్లు అర్జున్ ఎంతగా కష్టపడ్డాడో అంతకు మించి సుకుమార్ మరింత కష్టపడ్డాడు. సాధారణంగా ఒక సినిమా ప్రమోషన్ చేస్తున్నప్పుడు హీరోతో పాటు ఖచ్చితంగా దర్శకుడు కూడ ఆమూవీ గురించి మాట్లాడటం ఒక సాంప్రదాయం. ‘పుష్ప’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో సుకుమార్ కనిపించకపోవడానికి ఒక కారణం చెపుతూ ఈమూవీ ఫైనల్ రికార్డింగ్ కోసం సుకుమార్ ముంబాయిలో బిజీగా ఉన్నాడు అంటూ కారణాలు చెప్పారు.


అయితే ఈమూవీకి సంబంధించిన ఫైనల్ ప్రింట్ రెడీ అయిపోయి ఓవర్సీస్ కు పంపించిన తరువాత కూడ ఎక్కడా ‘పుష్ప’ ప్రమోషన్స్ లో సుకుమార్ కనిపించలేదు. బెంగుళూరులో అదేవిధంగా చెన్నైలో జరిగిన ఈమూవీ మీడియా మీట్స్ కు కూడ సుకుమార్ రాలేదు. ఈమూవీకి సంబంధించి ఛానల్స్ లో ప్రసారం చేస్తున్న ఇంటర్వ్యూలలో కూడ బన్నీ రష్మిక లు కనిపిస్తున్నారు కానీ ఎక్కడా సుకుమార్ కనిపించడం లేదు.


ఆఖరికి పత్రికలకు ఇస్తున్న ఇంటర్వ్యూలలో కూడ సుకుమార్ లేడు. దీనితో సుకుమార్ కు ఏమైంది అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. ఒకవైపు ‘ఆర్ ఆర్ ఆర్’ ను ప్రమోట్ చేసే విషయంలో రాజమౌళి చాల ఉత్సాహంగా పాల్గొంటున్నాడు. అయితే ఎక్కడా సుకుమార్ ప్రస్తావన ‘పుష్ప’ ప్రమోషన్స్ లో కనిపించడం లేదు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న గుసగుసల ప్రకారం ‘పుష్ప’ ను ఇంత హడావిడిగా విడుదల చేయడం సుకుమార్ కు ఏమాత్రం ఇష్టం లేదు అని కొందరు అంటారు.


అయితే అల్లు అర్జున్ ఒత్తిడితో ఈమూవీని చాల హడావిడిగా రెడీ పెట్టారు అన్న వార్తలు కూడ ఉన్నాయి. వాస్తవానికి ఈ మూవీ రెండు పార్ట్ లుగా విడుదల కావలసి ఉంది. ఈ రెండు పార్ట్ లను ఒకదాని వెంట ఒకటి కాకుండా బన్నీ ‘పుష్ప’ విడుదల తరువాత మరొక సినిమా చేసిన తరువాత తిరిగి ‘పుష్ప 2’ వైపు వస్తాడు అని అంటున్నారు. దీనితో ఈవిషయమై సుకుమార్ కు కొద్దిగా బాధ కల్గిందా అన్న గాసిప్పులు కూడ ఉన్నాయి. అంచనాల ప్రకారం ‘పుష్ప’ ఘన విజయం సాధిస్తే సుకుమార్ పేరు మారుమ్రోగడం ఖాయం..  





మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: