
పుష్ప రివ్యూ : వన్ మాన్ షో చేసిన అల్లు అర్జున్...!
తెలంగాణలో కొన్ని థియేటర్లలో ఎర్లీ మార్నింగ్ బెనిఫిట్ షోలు పడినట్టు సమాచారం.. సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్ హ్యాట్రిక్ మూవీ ఇది అని అందరికి తెలుసు.అలాగే ఆయనకు ఫస్ట్ పాన్ ఇండియా రిలీజ్ అని తెలుస్తుంది.. ఈ సినిమాతో హిందీ ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ అవుతున్నారట. సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయని తెలుస్తుంది.. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉందో తెలుసుకోవాలని చాలామందిలో ఆసక్తి ఉందని తెలుస్తుంది.ఆల్రెడీ ప్రీమియర్ షోలు చూసిన ప్రేక్షకులు ట్విట్టర్ వేదికగా తమ అభిప్రాయాలు చెబుతున్నారని సమాచారం.. సినిమాలో అల్లు అర్జున్ వన్ మ్యాన్ షో చేశాడనేది మెజార్టీ నెటిజన్స్ చెప్పే మాట అని తెలుస్తుంది.. అలాగే, యాక్షన్ సీన్లు అదిరిపోయాయని అంటున్నారట..
అల్లు అర్జున్ సెగలు పుట్టించాడని ఓ నెటిజన్ ట్వీట్ చేశారని సమాచారం.. బన్నీ తప్ప ఎవరూ కనిపించలేదని ఇంకొకరు ట్వీట్ చేశారట.. అల్లు అర్జున్ యాక్టింగ్ మరియు డైలాగ్ డెలివరీ చాలా బావుందని చిత్తూరు యాసలో చిట్టకొడుతున్నాడని ఒకరు పేర్కొన్నారట.'పుష్ప'లో ఇంటర్వెల్ తర్వాత వచ్చే ఫైట్ ఒక రేంజ్ అంటున్నారట.టోటల్ గా డిఫరెంట్ బన్నీని చూస్తారని డై హార్డ్ ఫ్యాన్ అని చెప్పుకొన్న ఒకరు ట్వీట్ చేశారట.. ఎలివేషన్ సీన్స్ అయితే హైలైట్ అని చెప్పవచ్చు.
ఆల్రెడీ టీజర్, ట్రైలర్లలో బైక్ డ్రైవ్ చేస్తూ అడవుల్లో బన్నీ చేసిన ఫైట్ ఉంటుందని చూపించారని అందరికి తెలుసు.ఆ ఫైట్ ఇచ్చిన హై టికెట్ రేటుకు రెండింతలు న్యాయం చేస్తుందని ఒకరు ట్వీట్ చేశారట.ఫారెస్ట్ ఫైట్‌కు పొర్లు దండాలు పెట్టొచ్చని ఇంకొకరు అన్నారట.. సమంత చేసిన స్పెషల్ సాంగ్, స్టెప్స్ కూడా హైలైట్ అంటున్నారట.. సినిమాలో మెయిన్ ట్విస్ట్ 'ఏ బిడ్డా ఇది నా అడ్డా' పాటలో ఉందని సమాచారం.అల్లు అర్జున్, రష్మిక మధ్య లవ్ సీన్స్, కామెడీ సూపర్ అని ఒకరు ట్వీట్ చేశారట.. సినిమాలో మలయాళ నటుడు ఫహాద్ ఫాజిల్ సెకాండఫ్‌లో ఎంట్రీ ఇచ్చాడని నెటిజన్స్ కన్ఫర్మ్ చేశారని తెలుస్తుంది.. బహుశా... సీక్వెల్‌లో అతడి రోల్ ఎక్కువ ఉండొచ్చట. 'పుష్ప' సీక్వెల్‌కు 'పుష్ప: ద రూల్' టైటిల్ పెట్టారట.. తమిళ్ మరియు హిందీ ప్రేక్షకులకు కూడా సినిమా నచ్చుతుందని ఒకరు ట్వీట్ చేశారట.అయితే... సోషల్ మీడియాలో సినిమాపై నెగెటివ్ టాక్ మరియు మిక్స్డ్ టాక్ కూడా నడుస్తోందని తెలుస్తుంది..