పుష్ప : థియేటర్ యాజమాన్యంలో భయం భయం?
ఇకపోతే పుష్ప సినిమా విడుదల నేపథ్యంలో ప్రస్తుతం అభిమానులందరూ భారీగా సినిమా థియేటర్లకు తరలి రావడానికి సిద్ధం అవుతున్నారు. ఎన్నో రోజులనుంచి సినిమా థియేటర్ కు దూరమైన ప్రేక్షకులు సైతం పుష్ప సినిమా కోసం థియేటర్లకు తరలివస్తున్నారు. ప్రస్తుతం ఇక పుష్ప బజ్ చూసుకుంటే సుకుమార్ అల్లు అర్జున్ కాంబినేషన్లో మరో హిట్ ఖాయం అన్నట్లుగానే కనిపిస్తోంది. అయితే పుష్ప సినిమా విడుదల నేపథ్యంలో థియేటర్ల యాజమాన్యాలు మాత్రం కాస్త భయం భయం గానే ఉన్నాయి.
అదేంటి పెద్ద సినిమా విడుదలైతే థియేటర్ యాజమాన్యం సంతోషించాలి కానీ భయం ఎందుకు అని అంటారా పెద్ద సినిమా విడుదల అవుతుంది అన్న సంతోషం ఉన్నప్పటికీ కొన్ని కొన్ని సార్లు పెద్ద సినిమా విడుదల సమయం లో భారీగా ప్రేక్షకులు థియేటర్కు చేరుకుంటారు. దీంతో కొంత ఆస్తి నష్టం కలిగే అవకాశం కూడా ఉంటుంది. టికెట్లు లభించక పోతే కొన్నిసార్లు ప్రేక్షకులు థియేటర్ల దగ్గర రచ్చ చేస్తూ ఉంటారు. అందుకే పెద్ద హీరో సినిమా కావడంతో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరుగుతాయేమో అని యజమానులు కాస్త ఆందోళన చెందు తున్నారు. ఇక ప్రేక్షకుల కోసం అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు.