ఆ సినిమాలో నేను నటించడం లేదు... తేల్చి చెప్పేసిన కీర్తి సురేష్..!

Pulgam Srinivas
కీర్తి సురేష్ తమిళ స్టార్ హీరో విజయ్ సరసన మూడో సారి నటించబోతుందని అంటూ ఒక వార్త గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో  తెగ వైరల్ అవుతుంది, అయితే ఇలా వైరల్ అవుతున్న ఈ వార్త పై కీర్తి సురేష్ స్పందించింది.  తమిళ నటుడు విజయ్ 66 వ సినిమాలో నేను నటించడం లేదని కీర్తి సురేష్ తేల్చి చెప్పేసింది.  కీర్తి సురేష్ గతంలో విజయ్ హీరోగా నటించిన భైరవ, సర్కార్ సినిమాల్లో హీరోయిన్ గా నటించింది, అయితే కీర్తి సురేష్, విజయ్ హీరోగా తెలుగు దర్శకుడు వంశీ పైడిపల్లి దర్శకత్వం లో దిల్ రాజు నిర్మాత గా ఒక సినిమా తెరకెక్కబోతోంది,  ఇప్పటికే ఈ సినిమా పనులు మొదలయ్యాయి, ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా ముమ్మరంగా జరుగుతున్నాయి. ఇందులో హీరోయిన్ కోసం దర్శక నిర్మాతలు పలువురు హీరోయిన్ ల పేర్లను పరిశీలిస్తున్నారు. అయితే ఈ మేరకు కీర్తి సురేష్ పేరు తెర పైకి వచ్చింది.


 అయితే ఈ విషయాన్ని కీర్తి సురేష్ దగ్గర ప్రశ్నించగా ఒకే ఒక్క మాటలో  నో అని చెప్పేసింది, దీని తో కీర్తి సురేష్ ముచ్చటగా మూడో సారి విజయ్ తో నటించడం లేదు అని తేలిపోయింది. ఇదిలా ఉంటే కీర్తి సురేష్ ప్రస్తుతం వరుస సినిమా లతో ఫుల్ బిజీగా ఉంది, ఈ మధ్యే రజనీకాంత్ హీరో గా తెరకెక్కిన పెద్దన్న సినిమాలో రజనీకాంత్ కు చెల్లెలు పాత్ర లో నటించిన ఈ ముద్దు గుమ్మ ప్రస్తుతం తెలుగులో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న బోలా శంకర్ సినిమాలో చిరంజీవి కి చెల్లెలి గా నటిస్తోంది. ఈ సినిమా తో పాటు మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వం లో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది, ఈ సినిమాను ఏప్రిల్ 1 వ తేదీ న విడుదల చేయబోతున్నట్లు ఇప్పటికే చిత్ర బృందం అఫీషియల్ గా ప్రకటించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: