ఎల్లో ఎల్లో డర్టీ ఫెలో... మంచు లక్ష్మి..!

Pulgam Srinivas
కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ముద్దుల కూతురు మంచు లక్ష్మి, సిద్ధార్థ్ హీరో గా శృతి హాసన్ హీరోయిన్ గా తెరకెక్కిన అనగనగా ఓ ధీరుడు సినిమాతో తెలుగు ప్రేక్షకులను పలకరించింది, ఈ సినిమా థియేటర్ ల వద్ద పెద్దగా ప్రభావం చూపకపోయినప్పటికే ఈ సినిమాలో మంచు లక్ష్మి ప్రతినాయక పాత్రకు మాత్రం మంచి ఆదరణ లభించింది. ఇలా మొదటి సినిమా లోనే ప్రతినాయక పాత్ర లో నటించి మెప్పించిన మంచు లక్ష్మి ఆ తర్వాత పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో నటించింది. కేవలం సినిమాలు మాత్రమే కాకుండా ఈ ముద్దు గుమ్మ పలు టీవీ షో లకు యాంకర్ గా కూడా వ్యవహరించింది, అలాగే వెబ్ సిరీస్ లోనూ నటించింది, ఓ టి టి లలో కూడా కొన్ని షో లకు హోస్ట్ గా వ్యవహరించింది.


  ఇలా సినిమాలతో, వెబ్ సిరీస్ లతో, టీవీ షో లతో ఫుల్ బిజీ గా ఉండే ఈ ముద్దు గుమ్మ సోషల్ మీడియాలో కూడా అంతే ఆక్టివ్ గా ఉంటూ తన అభిమానులతో అనేక విషయాలను పెంచుకుంటూ ఉంటుంది, తన సినిమా షూటింగ్ అప్డేట్ లను, తన  డైలీ యాక్టివిటీస్ ను తన అభిమానులతో ఎప్పటికప్పుడు పంచుకునే మంచు లక్ష్మి అప్పుడప్పుడు తన ఫోటో లను కూడా సోషల్ మీడియా అకౌంట్ అప్లోడ్ చేస్తూ ఉంటుంది, అయితే తాజా గా కూడా మంచు లక్ష్మి ఒక ఫోటో ను తన సోషల్ మీడియా అకౌంట్ లో పోస్ట్ చేసింది, మంచు లక్ష్మి పోస్ట్ చేసిన ఈ ఫోటోలో ఒక డిఫరెంట్ లుక్ ఉన్న ఎల్లో కలర్ డ్రెస్ ను వేసుకుంది, ఈ ఫోటో కు ఎల్లో ఎల్లో డర్టీ ఫెలో అనే క్యాప్షన్ ను రాసుకొచ్చింది, మంచు లక్ష్మి కి సంబంధించిన ఈ ఫోటో ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: