మహానటి అనిపించుకుని కెరియర్ లో వెనకపడ్డ కీర్తి సురేష్..?

shami
మళయాళంలో హీరోయిన్ గా చేస్తూ తెలుగులో నేను లోకల్ సినిమాతో ఎంట్రీ ఇచ్చిన బ్యూటీ కీర్తి సురేష్. మొదటి సినిమాతోనే ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్న అమ్మడు వరుస సినిమాలతో తన సత్తా చాటింది. ఇక నాగ్ అశ్విన్ డైరక్షన్ లో ఆమె నటించిన మహానటి సినిమా కీర్తి సురేష్ కు నేషనల్ అవార్డ్ వచ్చేలా చేసింది. మహానటి సావిత్రి బయోపిక్ గా వచ్చిన ఈ సినిమాలో కీర్తి సురేష్ నటన గురించి ఎంత చెప్పినా తక్కువే.

మహానటి అనిపించుకుని కెరియర్ కు ఇక తిరుగులేదు అనిపించుకున్న కీర్తి సురేష్ తను చేస్తున్న సినిమాల వల్ల కెరియర్ లో వెనకపడ్డది. ఎంచుకున్న కథలు.. చేసిన సినిమాలు కీర్తి సురేష్ గ్రాఫ్ పడిపోయేలా చేశాయి. మధ్యలో ఫీమేల్ సెంట్రిక్ సినిమాల తరహాలో మిస్ ఇండియా చేయగా అది కూడా అంచనాలను అందుకోలేదు. త్వరలో గుడ్ లక్ సఖి సినిమాతో రాబోతుంది కీర్తి సురేష్. ఈ సినిమాపై కూడా పెద్దగా బజ్ క్రియేట్ అవలేదు.

నితిన్ తో చేసిన రంగ్ దే జస్ట్ ఓకే అనిపించుకుంది. ప్రస్తుతం కీర్తి సురేష్ చేతిలో ఉన్న ఒకే ఒక్క సినిమా సర్కారు వారి పాట. ఆ సినిమాపైనే అమ్మడు ఆశలన్ని పెట్టుకుంది. మహేష్ సినిమాతో కీర్తి సురేష్ మళ్లీ తిరిగి ఫాం లోకి రావాలని చూస్తుంది. మరి అమ్మడు కోరినట్టు టాలీవుడ్ లో కెరియర్ మళ్లీ ఊపందుకుంటుందా లేదా అన్నది చూడాలి. కీర్తి సురేష్ మాత్రం తెలుగులో వరుస సినిమాలు చేయాలని చూస్తుంది. కథల విషయంలో జాగ్రత్త పడకపోతే మాత్రం అమ్మడు ఫేడ్ అవుట్ అయ్యే అవకాశం లేకపోలేదు. టాలీవుడ్ లో కీర్తికి మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నా సరే అమ్మడు ఎందుకో తిరిగి ఫాం లోకి రాలేకపోతుంది.సర్కారు వారి పాట అయినా ఆమెకు మంచి బూస్టింగ్ ఇస్తుందేమో చూడాలి.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: