వావ్.. ఐకాన్ స్టార్ తో రాజమౌళి..!
ప్రస్తుతం అల్లు అర్జున్ పుష్ప సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్నాడని తిన్నావా లుస్తుంది.. ఈ సినిమా ఈ నెల 17వ తేదీ ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోందని సమాచారం.. ప్రస్తుతం పుష్ప చిత్రబృందం సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉన్నారట.. ఈ సందర్భంగా అల్లుఅర్జున్ కొన్ని విషయాలు ప్రేక్షకులతో పంచుకున్నారని తెలుస్తుంది.
ఈ సినిమా కోసం యూనిట్ మొత్తం చాలా కష్టపడి షూటింగ్ పూర్తి చేశామని ముఖ్యంగా సుకుమార్ గారు ప్రతి ఒక్క ఎలిమెంట్ తానే స్వయంగా చూసుకుంటాడని చెప్పుకొచ్చారట . ఇకపోతే పుష్ప సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కు మన దర్శక ధీరుడు రాజమౌళి గారు కూడా పాల్గొన్నారని తెలుస్తుంది.. ఈనేపథ్యంలో అల్లు అర్జున్ రాజమౌళి కలిసి సినిమా చేయాలని అనుకున్నట్టు మాట్లాడుకున్న సంగతి అభిమానులకు అల్లు అర్జున్ వెల్లడించారని తెలుస్తుంది.అల్లు అర్జున్ రాజమౌళి గారిని మీతో సినిమా చేయాలని ఉందని అడగగా దానికి రాజమౌళి గారు నేను డైరెక్ట్ చేయాలనుకుని హీరోలలో మీరు కూడా ఉన్నారూ అని చెప్పడంతో అల్లు అర్జున్ సంతోషంగా ఫీల్ అయ్యారని తెలుస్తుంది.
అయితే త్వరలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మన దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో ఒక సినిమా రాబోతుందని తెలియడంతో అభిమానులు ఫుల్ ఖుషీ అయ్యారని తెలుస్తుంది.ప్రస్తుతం రాజమౌళి తెరకెక్కించిన RRRవిడుదల తర్వాత రాజమౌళి మహేష్ బాబు తో బిజీగా ఉన్నారట ఈ సినిమా అనంతరం అల్లు అర్జున్ సినిమా ఉండబోతోందని సమాచారం వినబడుతున్నట్లు తెలుస్తుంది.మరి చూడాలి రాజమౌళి అల్లుఅర్జున్ తో ఎలాంటి సినిమా తెరకేక్కిస్తాడో. ఒక వేళ చేసిన అది ఎన్ని సంవత్సరాలు పడుతుందో మరి అని అల్లుఅర్జున్ అభిమానులు అనుకుంటున్నారట.