ఆర్ ఆర్ ఆర్ పుష్ప ఆశలు నెరవేరుతాయా !
అయితే ఈ సినిమాలకు సంబంధించిన ఆశలు నెరవేరాలి అంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రస్తుతం అనుసరిస్తున్న టిక్కెట్ల రేట్ల పెంపు విషయమై అనుసరిస్తున్న పట్టుదల కొంతవరకు వీడాలి. ఇప్పటికే ఇండస్ట్రీ వర్గాల నుండి అనేక రాయబారాలు జరిగాయి. ఫలితం ఆశాజనకంగా లేకపోయినప్పటికీ మరో కొన్ని రోజులలో ఈ విషయానికి సంబంధించి ఎదో ఒక పాజిటివ్ నిర్ణయం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వర్గాల నుండి వస్తుందని భారీ సినిమా నిర్మాతలు ఆశగా ఎదురు చూస్తున్నారు.
ఈమధ్య ఆంధ్రప్రదేశ్ లో కురిసిన భారీ వర్షాలకు తీవ్రమైన వరదలు సంభవించడంతో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బాసటగా నిలుస్తు చాలామంది టాప్ హీరోలు విరాళాలు అందచేసారు. దీనితో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు తమ వైఖరిని మార్చుకుని పెద్ద సినిమాల వైపు పెద్ద మనసు చేసుకుంటారని ఇండస్ట్రీ వర్గాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. ఇప్పటికే ‘అఖండ’ సూపర్ హిట్ అయినప్పటికీ ఆంధ్ర ప్రాంతంలోని బయ్యర్లకు లాభాలు రాలేదు సరికదా ఇంకా వారు పెట్టిన పెట్టుబడి కూడ రాలేదు అన్నవార్తలు వినిపిస్తున్నాయి.
ఇలాంటి పరిస్థితులలో అత్యంత భారీ మొత్తాలకు కోస్తా జిల్లాల రైట్స్ ను కొనుక్కున్న ‘పుష్ప’ ‘ఆర్ ఆర్ ఆర్’ బయ్యర్లు తాము గట్టెక్కే విధంగా చివరి నిముషంలో అయినా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెద్దలు తమ నిర్ణయం టిక్కెట్ల రేట్ల పెంపు విషయంలో మార్చుకుని సహకరిస్తారు అన్న ఆశతో ప్రభుత్వ నిర్ణయం కోసం ఎదురు చూస్తున్నారు. ప్రభుత్వం నుంచి ‘పుష్ప’ విడుదల లోపు ఎదో ఒక నిర్ణయం రాకపోతే ఇక ఆశలు వదులు కున్నట్లే అన్నఅభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే ఈ విషయమై అంత సులువుగా ప్రభుత్వ స్పందన ఉండకపోవచ్చు అని కొందరు అంటున్నారు..