వావ్ : మెగాస్టార్ 156 మూవీ లో హీరోయిన్ గా ఆమె ... ??
మరోవైపు తమిళ వేదాళం మూవీ తెలుగు రీమేక్ గా తనతో మెహర్ రమేష్ తీస్తున్న భోళా శంకర్ సినిమా కూడా మొదలెట్టిన మెగాస్టార్, కొద్దిరోజుల క్రితం మైత్రి మూవీ మేకర్ వారి బ్యానర్ లో దర్శకుడు బాబీ తీస్తున్న సినిమా కూడా చేస్తున్నారు. అయితే విషయం ఏమిటంటే వీటితో పాటు నిన్న తన తదుపరి 156వ మూవీ కూడా మెగాస్టార్ అనౌన్స్ చేసిన విషయం తెలిసిందే. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై దానయ్య నిర్మాతగా ఛలో, భీష్మ చిత్రాల దర్శకడు వెంకీ కుడుముల తో మెగాస్టార్ ఒక మూవీ చేయనున్నారు. కాగా ఈ సినిమా మంచి యాక్షన్ తో కూడిన మాస్, కమర్షియల్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుండగా దీనిలో యువ భామ రష్మిక మందన్న మెగాస్టార్ కి జోడీగా నటించనుందని వార్త ప్రస్తుతం టాలీవడ్ వర్గాల్లో చక్కర్లు కొడుతోంది.
ఇప్పటికే కెరీర్ పరంగా ఎన్నో బ్లాక్ బస్టర్స్ తో దూసుకెళ్తున్న రష్మిక, గతంలో వెంకీ దర్శకత్వంలో రూపొందిన ఛలో. భీష్మ మూవీస్ లో హీరోయిన్ గా చేయగా ఈ మూవీలో కూడా మరొక్కసారి ఆమెనే హీరోయిన్ గా తీసుకోవాలని వెంకీ నిర్ణయిచారని, మరి అదే కనుక నిజం అయితే ఏకంగా మెగాస్టార్ సరసన హీరోయిన్ గా రష్మిక మంచి ఛాన్స్ కొట్టినట్లే అంటున్నారు టాలీవుడ్ వర్గాల వారు. మరి ఇందులో ఎంత వరకు వాస్తవం ఉందొ తెలియాలి అంటే దీనిపై అధికారిక ప్రకటన వచ్చే వరకు వెయిట్ చేయక తప్పదు.