రష్మిని టెన్షన్ పెట్టిన ప్రదీప్.. ప్రియమణి షాక్?

praveen
ఒకప్పుడు బుల్లితెరపై కేవలం సీరియల్స్ కి మాత్రమే ఎక్కువ క్రేజ్ ఉండేది. ఎన్నో రకాల ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు వచ్చినప్పటికీ ప్రేక్షకులు మాత్రం అంతగా ఆసక్తి చూపేవారు కాదు. కానీ ఇటీవల కాలంలో మాత్రం సీరియల్స్ ను చూడటం మానేసి ఎంటర్టైన్మెంట్ అందించే షోలను చూడటం మొదలుపెట్టారు బుల్లితెర ప్రేక్షకులు. దీంతో ఇక బుల్లితెరపై ఎప్పుడూ ఏదో ఒక కొత్త ప్రోగ్రాం తెరమీదికి వస్తూనే ఉంది. వినూత్నమైన కాన్సెప్ట్ తో వచ్చిన కార్యక్రమాలు ప్రేక్షకులను అలరిస్తూనే ఉన్నాయి. ఈ క్రమంలోనే ఇక ఇప్పుడు బుల్లితెర పైనే కాదు ఏకంగా ఓ టి టి ప్లాట్ఫామ్స్ వేదికగా కూడా ఎన్నో షో లు ప్రారంభం అవుతుండటం గమనార్హం.



 బుల్లి తెరపై సందడి చేస్తూ తమదైన వాక్చాతుర్యంతో ఆకట్టుకుంటున్న యాంకర్లు మాత్రమే కాదు స్టార్ హీరోలుగా కొనసాగుతున్న వారు సైతం ఓటిటీ వేదికగా షోలు నిర్వహిస్తూ ఉన్నారు. ముఖ్యంగా గత కొంత కాలం నుంచి ఆహా ఓటీటీ వేదికగా వరుసగా ఎన్నో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలు ప్రసారం అవుతూ ఉన్నాయి. నందమూరి బాలకృష్ణ unstoppable కార్యక్రమం చేస్తుండగా.. శ్రీముఖి చెఫ్ మంత్ర అనే కార్యక్రమాన్ని చేస్తుంది. ఇక ప్రదీప్ సర్కార్ అనే కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారడు.



 ఇకపోతే ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై నెంబర్ వన్ యాంకర్ గా కొనసాగుతున్న ప్రదీప్ చేస్తున్న సర్కార్ కార్యక్రమం ప్రేక్షకులను అలరిస్తుంది అని చెప్పాలి. ఇకపోతే ఇటీవలే సర్కార్ కార్యక్రమానికి సంబంధించిన ఎనిమిదవ ఎపిసోడ్ ప్రోమో సోషల్ మీడియా లో విడుదలై వైరల్ గా మారిపోయింది. ఈ ప్రోమో లో భాగంగా ప్రియమణి, వర్షిని,రష్మీ, బాబా భాస్కర్ మాస్టర్ స్పెషల్ గెస్ట్ లుగా వచ్చారు. ఈ క్రమంలోనే ఎవరికీ తెలియని ప్రశ్నలు అడిగిన ప్రదీప్  రష్మీ ని టెన్షన్ పెట్టాడు. ఇక ప్రదీప్ అడిగిన ప్రశ్నతో అటు ప్రియమణి సైతం షాక్ అయింది అని చెప్పాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: