సినీ ప్రపంచంలోని అందాల తారగా గుర్తింపు తెచ్చుకున్న శ్రీదేవి.. తన కూతురు జాన్వీ కపూర్ గురించి ఈ తరం యువత ను ఎవర్నడిగినా ఇట్టే చెప్పేస్తారు. ఆమె టీనేజ్లో ఉన్నప్పుడే తన అందచందాలతో .. హాట్ ఫోటోలకు ఫోజులు ఇస్తూ.. కుర్రకారుకు నిద్రలేకుండా చేస్తోంది. ఇక ప్రస్తుతం తల్లి ని మించిన అందం తో దూసుకుపోతూ నిత్యం గ్లామర్ షో తో సోషల్ మీడియానే హీట్ ఎక్కిస్తోంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు.
ఇకపోతే ఆమె తన సినిమాలలో ప్రతి పాత్రకు ప్రాధాన్యం ఇస్తూ.. తనకు గుర్తింపు వస్తుంది అనే సినిమాలను మాత్రమే చేసుకుంటూ తనదైన శైలిలో సినీ ఇండస్ట్రీలో దూసుకుపోతోంది జాన్వీ కపూర్. ఇకపోతే గత సంవత్సరం ‘గుంజాన్ సక్సేనా: ద కార్గిల్ గర్ల్’ అనే బయోపిక్ మూవీలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమాతో విమర్శకుల ప్రశంసలు కూడా అందుకుంది. ఇక తాజాగా నటించిన ‘రూహీ’ అనే చిత్రం మాత్రం ప్రేక్షకులను నిరాశ పరిచే లోనే చెప్పాలి. ఇక ఈ సినిమాతో ఈమెకు ఎలాంటి గుర్తింపు రాలేదు.
ఇకపోతే ప్రస్తుతం జాన్వీకపూర్ విమానాశ్రయం నుంచి బయటకు వస్తుండగా.. ఫోటోగ్రాఫర్ ల కంటపడిన జాన్వీ కపూర్ ను వారు తమ కెమెరాలలో బంధించడం జరిగింది. అయితే ఆమె తన చేతికి పెద్ద కట్టు కట్టి ఉండడం చూసి విలేకరులు ఆమెను ఏమైంది అని అడగగా.. జాన్వీ కపూర్ మాత్రం ఎటువంటి సమాధానం ఇవ్వకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయింది. దీంతో అందరూ ఒక్కసారిగా
జాన్వి కపూర్ కి ఏమైంది.. ఎందుకు ఆ చేతికి అంత పెద్ద కట్టు కట్టారు అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈమె చేతిలో రెండు క్రేజీ ప్రాజెక్టులు ఉన్నట్లు సమాచారం.అందులో ఒకటి ‘గుడ్ లక్ జెర్రీ’ ఈ
సినిమా తమిళంలో సూపర్ హిట్ అయిన ‘కలమావు కోయిల’ అనే సినిమాకు రీమేక్. ఇక మరొక చిత్రం ‘దోస్తానా 2′ . అలాగే..ఇటీవలే తన
తండ్రి బోనీ కపూర్ నిర్మిస్తోన్న ‘మిలీ’
సినిమా షూటింగ్‌ను కూడా పూర్తి చేసుకుంది.