కొంత కాలం క్రితం వరకు
థియేటర్ లలో విడుదల అయిన సినిమాలు కనీసం 50 రోజుల వరకు ఓ టి టి లలో స్ట్రీమింగ్ అయ్యేవి కావు, కానీ ప్రస్తుతం పరిస్థితులు మారాయి.
కరోనా ఎంటర్ అయిన తర్వాత నుండి కొన్ని సినిమాలు నేరుగా ఓ టి టి లోనే విడుదల అవుతూ ఉంటే, మరి కొన్ని సినిమాలు మాత్రం
థియేటర్ లలో విడుదల అయినప్పటికీ నెల రోజులు తిరక్కుండానే ఓ టి టి లోకి వచ్చేస్తున్నాయి. స్టార్ హీరోల సినిమాలు ఏవైనా అయితే ఓ టి టి లో స్ట్రీమింగ్ కావడానికి కొంత ఆలస్యం అవుతున్నాయి, అదే మీడియం రేంజ్ హీరోలు సినిమాలు, అయినా లేదా
థియేటర్ లలో విడుదల అయ్యి అక్కడ సరైన టాక్ ను సంపాదించుకోలేని సినిమాలు మాత్రం అతి తక్కువ కాలంలోనే ఓ టి టి లోకి వచ్చేస్తున్నాయి.
అయితే తాజా గా
మోహన్ లాల్ నటించిన మరక్కర్
సినిమా కూడా
థియేటర్ లలో విడుదల అయిన అతి తక్కువ కాలంలోనే ఓ టి టి లోకి వచ్చేస్తుంది.
డిసెంబర్ 2 వ తేదీ న పాన్
ఇండియా రేంజ్ లో విడుదలైన ఈ సినిమాకు తెలుగు నాట అఖండ
సినిమా నుంచి చాలా గట్టి పోటీ ఎదురైంది, అలాగే ఈ సినిమాకు కూడా సరైన టాక్
టాలీవుడ్ లో రాకపోవడం తో ఈ
సినిమా ను తెలుగు ప్రేక్షకులను ఏ మాత్రం ప్రభావితం చేయలేకపోయింది. దానితో ఈ
సినిమా ను నాలుగు భాషల్లో
డిసెంబర్ 17 వ తేదీన ప్రముఖ ఓ టి టి సంస్థ
అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమింగ్ కానున్నట్లు ఈ సంస్థ అధికారి కంగా ప్రకటించింది. మరక్కర్ సినిమాకు
ప్రియదర్శన్ దర్శకత్వం వహించగా
కీర్తి సురేష్, సుహాసిని,
అర్జున్ ముఖ్య పాత్రలు పోషించారు.