తెల్ల జుట్టుతో వెంకటేష్.. కొత్త లుక్ ఇదేనా?

praveen
గత కొంత కాలం నుంచి వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ తనదైన నటనతో పాత్రలకు ప్రాణం పోస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు సీనియర్ హీరో వెంకటేష్. ఓవైపు యువ హీరోలతో కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు విభిన్నమైన కథాంశంతో కూడిన సినిమాలలో కూడా నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నారు. నారప్ప అనే కన్నడ మూవీ తెలుగు రీమేక్ లో సూపర్ డూపర్ హిట్ సాధించిన వెంకటేష్ ఇక ఇటీవల దృశ్యం 2  సినిమాతో కూడా మంచి విజయాన్ని అందుకున్నారు.


 ఇక ఇప్పుడు ఎఫ్ 3 అనే సినిమాలో నటిస్తున్నారు అనే విషయం తెలిసిందే. అదే సమయంలో ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యేందుకు అటు వెబ్ సిరీస్ లో కూడా నటించేందుకు సిద్ధమయ్యారు. ఈ క్రమంలోనే మరికొన్ని రోజుల్లో ఒక వెబ్ సిరీస్ లో వెంకటేష్ కనిపించబోతున్నారు అంటూ ఎన్నో రోజుల నుంచి టాక్ వినిపిస్తోంది. ప్రముఖ  ఓటీటీ సంస్థ నెట్ఫ్లిక్స్ లో నిర్మిస్తున్న ఒక వెబ్ సిరీస్ లో దగ్గుబాటి వారసుడు రానాతో కలిసి వెంకటేష్ తెర పంచుకోనున్నారు. ఇక ఈ దగ్గుబాటి హీరోలు ఇద్దరిని కూడా ఒకే తెరపై చూడడానికి ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.


 కాగా నేడు వెంకటేష్ పుట్టినరోజు సందర్భంగా వెంకటేష్ హీరోగా నటిస్తున్న ఎఫ్ 3 సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల చేశారు.అదే సమయంలో అటు వెబ్ సిరీస్ లో వెంకటేష్ పాత్రకు సంబంధించిన లుక్ ను కూడా విడుదల చేసినట్లు తెలుస్తోంది. నెరసిన జుట్టు గడ్డం చెవికి పోగు తో వెంకటేష్ లుక్  ఎంతో కొత్తగా కనిపిస్తుంది. ఇక వెంకటేష్ ఈ సినిమాలో రానా నాయుడు పాత్రలో నటిస్తున్నట్లు తెలుస్తోంది. ఇక వెంకటేష్ చేతిలో ఎవరిదో పాస్పోర్ట్ సైజ్ ఫోటో కూడా ఉంది.ఇక ఈ లుక్ అభిమానులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఇప్పటి వరకు ఎన్నడూ కనిపించని లుక్ లో వెంకటేష్ కనిపించడం.. అందరికీ వెబ్ సిరీస్ పై అంచనాలను పెంచుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: