అదిరిపోయే డీల్ ని సెట్ చేసుకున్న ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం..!

Pulgam Srinivas
దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన చిత్రం ఆర్ఆర్ఆర్, ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తుండగా, ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు, ఈ సినిమాలో అజయ్ దేవ్ గన్, సముద్ర ఖని ముఖ్య పాత్రలో కనిపించబోతున్నారు. ఈ సినిమా ను ఎంతో ప్రతిష్టాత్మకంగా, భారీ బడ్జెట్ తో డివివి దానయ్య నిర్మించారు,  ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ మరియు పోస్టు ప్రొడక్షన్ పనులు పూర్తి కావడంతో ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా జనవరి 7 వ తేదీ న ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం కొన్ని రోజుల క్రితమే అఫీషియల్ గా ప్రకటించింది. ఇలా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటంతో ఈ చిత్ర బృందం ప్రమోషన్ ల  స్పీడ్ పెంచింది, అందులో భాగంగా ఈ మధ్య ఈ సినిమా ట్రైలర్ ను విడుదల చేయగా, ఈ ట్రైలర్  జనాల నుండి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోవడం మాత్రమే కాకుండా ఈ సినిమాపై ఉన్న అంచనాలను మరింత గా పెంచింది.


 ఇప్పటికే జనాలలో  మంచి అంచనాలను రేకెత్తించిన ఈ సినిమా కు సంబంధించి ఒక ఆసక్తి కరమైన వార్త ప్రస్తుతం ప్రస్తుతం సోష ల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. అసలు విషయంలోకి వెళ్తే.. ఆర్ఆర్ఆర్ సినిమాకు ఓటిటి రైట్స్ ను  ప్రముఖ ఓటిటి సంస్థ నెట్ ఫ్లిక్స్ భారీ మొత్తం వెచ్చించి కైవసం చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఆర్ఆర్ఆర్ సినిమా విడుదల అయిన తర్వాత 60 రోజులకు ఓటిటి లో ఈ సినిమాను స్ట్రీమింగ్ చేసే విధంగా  చిత్ర బృందం నెట్ ఫ్లిక్స్ ఓటిటి సంస్థతో ఒప్పందాలు కుదుర్చుకున్నట్లు వార్తలు వస్తున్నాయి, మరి ఇప్పటి వరకూ ఈ వార్తలపై ఎలాంటి అధికారిక ప్రకటన వెలువ డలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: