బన్నీని అడిగేవి చాలా ఉన్నాయంటూ అనసూయ కామెంట్స్..!!
పుష్ప సినిమా నుండి ఇప్పటికే విడుదలైన అనసూయ లుక్ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ సినిమాను సుకుమార్ రెండు భాగాలుగా తెరకెక్కుతుండగా ఈ సినిమా ఫస్ట్ పార్ట్ డిసెంబర్ నెల 17వ తేదీన విడుదల చేయనున్నారు. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ యూసఫ్ గూడ పోలీస్ గ్రౌండ్స్‌లో నిర్వహించారు. ఈ ఈవెంట్‌కి స్టార్ డైరెక్టర్లు కొరటాల శివ, రాజమౌళి ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు గెస్టులుగా హాజరై సినిమాపై అంచనాలను భారీ స్థాయిలో పెంచారు.
ఇక ఈ ఈవెంట్‌లో యాంకర్ అనసూయ మాట్లాడుతూ.. ప్రేక్షకుల ముందు ఏం మాట్లాడాలో కూడా తనకు అర్థం కావడం లేదని అన్నారు. అయితే వాస్తవానికి ఇది ఓ కలలా అనిపిస్తుందన్నారు. అంతేకాదు.. బన్నీకి స్పెషల్‌గా తాను కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానన్నారు. అందరూ తల్లిదండ్రులను, దేవుడిని కోరికలు కోరుకుంటారని.. తాను మాత్రం బన్నీని కోరుకోగా 7 రోజుల్లో ఫోన్ కాల్ వచ్చిందని అనసూయ తెలిపారు. ఇక ఇది కంటిన్యూ అవుతుంటే ఇంకా చాలా సినిమా ఛాన్సులు అడగాలని అనసూయ తెలిపారు.
అయితే అనసూయ ఛాన్స్ అడిగిన సమయంలో బన్నీ, సుకుమార్ సైగలు చేసుకుని తనకు అవకాశం ఇచ్చారని చెప్పుకొచ్చారు. ఇక రామ్ చరణ్ నటించిన రంగస్థలం సినిమాలోని రంగమ్మత్త పాత్ర తన కెరీర్‌కు మైల్ స్టోన్ అని అనసూయ అన్నారు. అలాగే భవిష్యత్తులో నన్ను, సునీల్‌ను చాలాసార్లు చూస్తారని ఆమె చెప్పుకొచ్చారు. ఇక సినిమాల విషయంలో తగ్గేదేలే అంటూ అనసూయ తెలిపారు.