రజనికాంత్ తను తెలుగులో బాగా అభిమానించే నటుడు ఎన్టీఆర్ అని తెలుస్తుంది.ఇక తన అభిమాన నటుడు యన్టీఆర్ తో కలసి రజనీకాంత్ ‘టైగర్’లో నటించారట. 1979లో తెరకెక్కిన ఈ చిత్రానికి నందమూరి రమేశ్ దర్శకుడని ఇందులో జయసుధ చెల్లెలు సుభాషిణి రజనీకాంత్ కు జోడీగా నటించారట. ‘టైగర్’ షూటింగ్ సమయంలోనే తాను అన్న యన్టీఆర్ ను ఎంతలా అభిమానించింది పదే పదే ఇంటర్వ్యూలలో చెప్పారట రజనీకాంత్. అప్పట్లో రజనీకాంత్ సమయం దొరికితే చాలు మందు కొట్టేవారని తెలుస్తుంది.. ఈ విషయం యన్టీఆర్ కు తెలిసి, ‘బ్రదర్.మీకు ఎంతో భవిష్యత్ ఉందని ఆ మందు అలవాటు మానుకోండి.’ అని సూచించారని తెలుస్తుంది.. అంతేకాదు, ఆ అలవాటు మానుకోవడానికి యోగ మరియు ప్రాణాయామం ఆశ్రయించమనీ చెప్పారని తెలుస్తుంది.. అంతకు ముందే యోగాభ్యాసం చేస్తున్నా యన్టీఆర్ సలహా ఇచ్చిన తరువాత సీరియస్ గా తీసుకొని దానిని మరింత నిష్టతో అభ్యాసం చేశారట రజనీ. ఆ తరువాత ఆయన ఆధ్యాత్మిక చింతనలో సాగడం ఆరంభించారట.ఆ సాధన తరువాతే రజనీకాంత్ తమిళనాట అనూహ్యంగా సూపర్ స్టార్ స్థాయికి చేరుకున్నారట అయినా రజనీకాంత్ ఏ నాడూ ఆధ్యాత్మిక చింతనకు దూరం కాలేదట. తరచూ హిమాలయలకు వెళ్ళి అక్కడ బాబాలను దర్శించుకొని వస్తూ ఉంటారట అలా వెళ్ళి వచ్చిన ప్రతీసారి రజనీకాంత్ కు ఏదో ఒక మంచి జరిగేదని చెబుతారట .
ఆధ్యాత్మిక భావనతోనే ‘బాబా’ చిత్రాన్ని సొంతగా నిర్మించి నటించారు అయితే ఆ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్లుకోలేక పోయిందట . కొనుగోలు దారులు నష్టాల పాలయ్యారట వారి నష్టాన్ని భర్తీ చేసేందుకు కొంతమొత్తాన్ని తిరిగి ఇచ్చారట రజనీకాంత్. ఈ సంప్రదాయంలోనూ రజనీకాంత్ యన్టీఆర్ నే అనుసరించడం జరిగిందట. ఎలాగంటే, యన్టీఆర్ నటించి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ‘బ్రహ్మర్షి విశ్వామిత్ర’ ను 1991లో విడుదల చేశారట. ఆ సినిమాపై క్రేజ్ తో భారీ రేట్లకు కొన్నారట. అయితే ఆ చిత్రం జనాదరణ పొందలేక పోయిందని దాంతో కొనుగోలుదారులకు నష్టాలు వాటిల్లాయట అప్పుడు యన్టీఆర్ నష్టపోయినవారికి పరిహారం చెల్లించారట అదే పంథాలో రజనీ సైతం సాగడం విశేషం.
ఇలా రామారావు అంటే ఎంతగానో అభిమానించే రజనీకాంత్ 1995లో యన్టీఆర్ ను చంద్రబాబు అండ్ కో బర్తరఫ్ చేసినప్పుడు వారి తరపున మాట్లాడారట.అప్పట్లో రజనీకాంత్ తో ఏపీ అసెంబ్లీ ఆవరణలోని సమావేశమందిరంలో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారట.ఆ సమయంలో యన్టీఆర్ ను తమిళనాట పెరియార్ గా పేరొందిన రామస్వామి నాయకర్ తో పోల్చారట రజనీకాంత్. తరువాత హైదరాబాద్ నుండి మద్రాసుకు బయలు దేరుతూ ఉండగా ఎయిర్ పోర్ట్ లో మళ్ళీ విలేఖరులు అడిగిన ఓ ప్రశ్నకు తానెప్పటికీ అన్న యన్టీఆర్ అభిమానినేనని గర్వంగా చెప్పుకున్నారట రజనీకాంత్. ఇప్పటికీ హైదరాబాద్ వచ్చిన ప్రతీసారి యన్టీఆర్ ను స్మరించుకుంటూ ఉంటారట రజనీకాంత్. ‘అన్న లేని లోటు తీర్చలేనిది’ అని అంటూ ఉంటారని తెలుస్తోంది.