నెట్ ఫ్లిక్స్ ఆఫర్ తో కన్ఫ్యూజన్ లో భీమ్లా నాయక్ !

Seetha Sailaja
‘భీమ్లా నాయక్’ పాటలు ప్రస్తుత తరం యూత్ కు బాగా కనెక్ట్ కావడంతో ఈమూవీ పై మరింత అంచనాలు పెరిగిపోయాయి. పవన్ అభిమానులు తమ పవర్ స్టార్ ను ఎలాంటి మాస్ లుక్ లో చూడాలని ఆశపడుతున్నారో అలాంటి మాస్ లుక్ లో ఈ మూవీలో పవన్ కనిపించబోతున్నాడు.

దీనితో పెరిగిన అంచనాల మధ్య ‘భీమ్లా నాయక్’ ను సంక్రాంతి రేస్ లో ‘ఆర్ ఆర్ ఆర్’ ‘రాథే శ్యామ్’ లతో పోటీగా దింపుతున్నారు. వాస్తవానికి ఈ మూవీని సంక్రాంతి రేస్ నుండి తప్పించాలని ఎన్నో ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ ఈ మూవీ నిర్మాతలు రాజమౌళి రాయబారాలకు స్పందించడంలేదు అన్న మాటలు కూడ వినిపిస్తున్నాయి.

సంక్రాంతి రేస్ కు మూడు భారీ సినిమాలు విడుదల అయితే తెలుగు రాష్ట్రాలలో ధియేటర్లు ఎక్కడ దొరుకుతాయి అన్న సందేహాలతో పాటు అనవసరంగా ఏసినిమాకు సరైన కలక్షన్స్ రావు అన్న విషయాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజ్ చెపుతున్నప్పటికీ ‘భీమ్లా నాయక్’ నిర్మాతలు ఆ విషయాలను సీరియస్ గా తీసుకోవడం లేదు అన్న వార్తలు కూడ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల మధ్య ఈ సినిమా గురించి ఒక షాకింగ్ న్యూస్ ఇప్పుడు ప్రచారంలోకి వచ్చింది.

ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ ఈ సినిమాకు సంబంధించిన రైట్స్ ను తమకు ఇచ్చి వేస్తే ఈమూవీ నిర్మాతలకు 225 కోట్లు ఇస్తామని చెప్పినట్లుగా వస్తున్న వార్తలు ఎంతవరకు నిజం అంటూ ఇండస్ట్రీ వర్గాలు ఆశ్చర్యపోతున్నాయి. దీనికి కారణం పవన్ కళ్యాణ్ సినిమాలను ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారు చూస్తారు కాని మరెవ్వరు చూడరు. అలాంటి పరిస్థితులలో వ్యాపారంలో తాము ఖర్చు చేసే ప్రతి ఒక్క రూపాయి విషయంలోనూ ఎంతో వ్యూహాత్మకంగా వ్యవహరించే నెట్ ఫ్లిక్స్ పవన్ సినిమా పై ఇంత భారీ మొత్తాన్ని పెట్టుబడిగా పెడుతుందా అంటూ చాలామంది సందేహాలు వ్యక్త పరుస్తున్నారు..


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: