అదిరిపోయిందిగా.. జబర్దస్త్ ను మించిన పంచులు?
ఒకవైపు సుమ క్యాష్ షో లోకి వచ్చే కంటెస్టెంట్ లు సందడి చేస్తే.. మరోవైపు స్పాంటేనియస్ పంచులతో సుమ అదరగొడుతుంది. ప్రతి వారం కూడా నలుగురు సెలబ్రిటీలను కూడా పిలుస్తూ ఉంటుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఈ వారం ఈటీవీలో జబర్దస్త్ కమెడియన్స్ తో పాటు యాంకర్లు కూడా సుమ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న క్యాష్ కార్యక్రమానికి స్పెషల్ గెస్ట్ గా వచ్చారు. జబర్దస్త్ కమెడియన్స్ ఆటో రాంప్రసాద్, బుల్లెట్ భాస్కర్ వారి తండ్రులతో వస్తే ఇక యాంకర్లు మేఘన, విష్ణు ప్రియ వారి మదర్స్ తో వచ్చారు.
ఈ క్రమంలోనే ఇటీవల విడుదలైన ప్రోమో ఎంతో సందడి సందడిగా సాగే పోయింది అని చెప్పాలి. ఇక ఈ ప్రోగ్రామ్లో భాగంగా బుల్లెట్ భాస్కర్ తండ్రి అప్పారావు వేసిన పంచులు అయితే ప్రేక్షకులని కడుపుబ్బా నవ్వించాయి అని చెప్పాలి. ఇప్పటివరకు ఈటీవీ లో పలు కార్యక్రమాలలో తనదైన శైలిలో కామెడీ చేసి అలరించారు బుల్లెట్ భాస్కర్ తండ్రి అప్పారావు. ఇక ఇటీవల క్యాష్ షో లో కూడా ఏకంగా స్పాంటేనియస్ పంచులతో అదరగొట్టారు. ఇక ఇలాంటి పంచులు అటు జబర్దస్త్ కార్యక్రమం లో కూడా కనిపించవు అని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మరి ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా ప్రోమో చూసి కాసేపు హాయిగా నవ్వుకోండి.