వైరల్ : తెలుగులో మాట్లాడిన ఆలియాభట్?

praveen
ఎన్నో రోజుల నుంచి ఇతర భాషలకు సంబంధించిన హీరోయిన్లు టాలీవుడ్ లో నటిస్తూ ఉండటం గమనార్హం. ఇలా ప్రస్తుతం తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోయిన్గా కొనసాగుతున్న వారు ఇతర భాషల నుంచి వచ్చినవారే  ఉన్నారు. అయితే ఇలా స్టార్ హీరోయిన్ గా కొనసాగుతున్న కొంతమంది హీరోయిన్లు తెలుగు భాషను బాగా నేర్చుకుని మాట్లాడుతూ ఉంటారు. కానీ కొంతమంది హీరోయిన్లు మాత్రం నమస్కారం అనే మాట తెలుగులో మాట్లాడుతూ మిగతా మొత్తం ఇంగ్లీష్ లో మాట్లాడుతూ ఉంటారు. ఇక సినిమా ఫంక్షన్లకు విచ్చేసిన తెలుగు ప్రేక్షకులకు కొన్ని కొన్ని సార్లు హీరోయిన్లు మాట్లాడే భాష అర్థం కాక పోయినప్పటికీ చప్పట్లతో ఎంకరేజ్ చేస్తూ ఉంటారు.


 ఇటీవలి కాలంలో మాత్రం తెలుగు చిత్ర పరిశ్రమలో నటిస్తున్న ఎంతో మంది హీరోయిన్లు తెలుగు నేర్చుకోవడానికి ఎంతగానో ఇష్టపడుతున్నారు. తక్కువ సమయంలోనే తెలుగు నేర్చుకుంటూ ఇక సినిమాకు సంబంధించిన ఫంక్షన్స్ జరిగిన సమయంలో తెలుగులోనే మాట్లాడుతూ ప్రేక్షకులు అందరినీ అలరిస్తూ ఉంటారు. ఇలా ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోల సరసన నటిస్తున్న బాలీవుడ్ హీరోయిన్లు కూడా తెలుగు లో మాట్లాడుతూ ఉండటం గమనార్హం. ఇటు ఇటీవలే ఆర్ఆర్ఆర్ అనే సినిమాలో సీత పాత్రలో నటించిన అలియాభట్  కూడా ప్రెస్మీట్లో తెలుగులో మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచింది.


 ఇటీవలి కాలంలో బాలీవుడ్ హీరోయిన్లు తెలుగులో నటిస్తున్నప్పటికీ వారికి తెలుగు రావడం మాత్రం చాలా కష్టం అనే చెప్పాలి. అయితే ఇటీవలే ట్రైలర్  విడుదలైన తర్వాత ఆర్ఆర్ఆర్ చిత్ర బృందం ఒక ప్రెస్ మీట్ నిర్వహించగా ఇక ఈ ప్రెస్మీట్లో సీత పాత్రలో నటించిన బాలీవుడ్ బ్యూటీ అలియాభట్ మాట్లాడింది. ఈ సందర్భంగా తెలుగులో మాట్లాడి అందరికీ సర్ప్రైజ్ చేసింది. నమస్కారం బాగున్నారా అంటూ అడిగింది.. మీరు బాగున్నారా అంటూ మీడియా వాళ్లు ప్రశ్నించగా నేను బాగున్నాను అంటూ సమాధానం చెప్పింది. ఆర్ఆర్ఆర్ ట్రైలర్ పగిలి పోయింది కదా అంటూ అడిగింది అలియా భట్.. ట్రైలర్ చూసిన తర్వాత ముంబైలో  పిచ్చెక్కింది అంటూ తెలిపింది. బాలీవుడ్ హీరోయిన్ తెలుగులో మాట్లాడటంతో ఫ్యాన్స్ అందరూ ఖుషి అవుతున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: