దర్శక ధీరుడు రాజమౌళి ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్న సినిమా ఆర్ఆర్ఆర్ ఈ సినిమా లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ హీరోలుగా నటిస్తూండగా, ఆలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్ లుగెస్ నటిస్తున్నారు, అలాగే ఈ సినిమాలో అజయ్ దేవగన్, సముద్ర కని ముఖ్య పాత్రల్లో కనిపించబోతున్నారు. ఈ సినిమా ను భారీ ఖర్చు తో డివివి దానయ్య నిర్మిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ మరియు పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కావడం తో ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుక గా జనవరి 7 వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా విడుదల చేయబోతున్నారు, ఇలా ఈ సినిమా విడుదల తేది దగ్గర పడటం తో చిత్ర బృందం ప్రమోషన్ ల స్పీడ్ పెంచారు.
ఇందులో భాగంగా ఈ మధ్య నే ఈ సినిమా ట్రైలర్ ను కూడా విడుదల చేశారు, ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కు జనాల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకొని ఈ సినిమాపై మరింత అంచనాలు పెంచేసింది. అయితే ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తున్న అలియా భట్ కు సంబంధించిన ఒక వార్త ప్రస్తుతం నెట్టింట్లో వైరల్ అవుతుంది. ఇక వివరాల్లోకి వెళితే.. ఆర్ఆర్ఆర్ మూవీ లో సీత పాత్ర ను కైవసం చేసుకున్న ఆలియా భట్ ఆ పాత్ర ఎలా వచ్చింది అనే విధానాన్ని తెలియజేసింది. నేను రాజమౌళి సర్ ని హైదరాబాద్ ఎయిర్ పోర్ట్ లో కలిసాను. వెంటనే రాజమౌళి సర్ తో నాకు మీ సినిమా లో పని చేయాలి ఉంది అని చెప్పాను. నేను మీ మూవీ లో నటించేందుకు ఏ మైనా చేస్తాను అని చెప్పాను. నాకు ఆశ్చర్యం కలిగే లా రాజమౌళి, సీత పాత్ర ను అప్పగించారు అని ఆలియా భట్ చెప్పుకొచ్చింది.