కొంత కాలం క్రితం వరకు థియేటర్ లలో విడుదలైన సినిమాలు ఓ టి టి లోకి రావాలి అంటే చాలా రోజుల సమయం పట్టేది, అదే స్టార్ హీరోల సినిమాలు అయినట్లయితే దాదాపుగా 50 రోజులు అంతకు మించిన రోజులు గడిచిన తర్వాతే ఓ టి టి లో స్ట్రీమింగ్ అయ్యేవి. కానీ ప్రస్తుతం అలాంటి పరిస్థితులు కనబడడం లేదు. కొన్ని సినిమాలు థియేటర్ లలో విడుదల చేయకుండా నేరుగా ఓ టి టి లొనే విడుదల చేస్తూ ఉంటే, మరి కొన్ని సినిమా లను థియేటర్ లలో విడుదల చేసినప్పటికీ అవి మంచి టాక్ ను సంపాదించుకొని థియేటర్ ల దగ్గర మంచి కలెక్షన్ లను సాధించి న్నట్లయితే ఆ సినిమాలు ఓ టి టి లోకి రావడానికి కొంత సమయం పడుతుంది. థియేటర్ లలో విడుదలైన సినిమాలు ఫ్లాప్ టాక్ ను తెచ్చుకున్నట్లు అయితే ఆ సినిమాలు దాదాపుగా నెల తిరిగే లోపలే ఏదో ఒక ఓ టి టి ప్లాట్ ఫాం లో స్త్రీమ్మింగ్ అవుతున్నాయి.
ఇది ఇలా ఉంటే రాజ్ తరుణ్ హీరో గా తెరకెక్కిన అనుభవించు రాజా సినిమా 26 నవంబర్ థియేటర్ లలో విడుదల అయింది, థియేటర్ ల దగ్గర ఈ సినిమాకు అనుకున్న రేంజ్ లో ఫలితం దక్కలేదు. దాని తో ఈ చిత్ర బృందం ఈ సినిమాను నెల తిరగకుండానే ఓ టి టి లో విడుదల చేయడానికి సిద్ధమయ్యారు. తెలుగు ప్రముఖ ఓ టి టి ఆహా లో అనుభవించు రాజా సినిమా డిసెంబర్ 15 వ తేదీ నుండి స్ట్రీమింగ్ కావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాను థియేటర్ లలో చూడాలి అనుకొని మిస్ అయిన వారు, డిసెంబర్ 15 వ తేదీ నుండి ఈ సినిమాను తెలుగు ప్రముఖ ఓ టి టి ఆహా లో చూడవచ్చు.