ఆర్ ఆర్ ఆర్ నిడివి ముందు కుదించుకున్న రాథే శ్యామ్ !
వాస్తవానికి ఈమూవీ నిడివి 3 గంటల 30 నిముషాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎడిటింగ్ టేబుల్ దగ్గర రాజమౌళి ఎంతో ప్రయత్నించిన తరువాత మాత్రమే ఈమూవీ నిడివి 3గంటల 7నిముషాలకు కుదించగలిగారు అన్న మాటలు వస్తున్నాయి. ఈ సినిమాకు పూర్తి విభిన్నం ‘రాథే శ్యామ్’ కథా వస్తువులో మాత్రమే కాదు ఈమూవీ నిడివి విషయంలో కూడ ప్రభాస్ ‘రాథే శ్యామ్’ ను విభిన్నంగా తీర్చి దిద్దుతున్నాడు. ఈమూవీ ఫైనల్ ఎడిటింగ్ పూర్తి అయిన తరువాత ఈసినిమా నిడివి 2గంటల 20నిముషాలు వచ్చిందని తెలుస్తోంది.
సంక్రాంతి సినిమాలలో ప్రభాస్ సినిమా మాత్రమే నిడివి విషయంలో చిన్న సినిమాగా రికార్డు క్రియేట్ చేయబోతోంది అనుకోవాలి. అయితే ఈమూవీ హిందీ వెర్షన్ మాత్రం 2గంటల 30నిముషాలు ఉంటుందని లీకులు వస్తున్నాయి. వాస్తవానికి బాలీవుడ్ లో ప్రభాస్ కు ఉన్న మ్యానియాతో పోలిస్తే చరణ్ జూనియర్ లకు క్రేజ్ తక్కువ. అయినా ‘ఆర్ ఆర్ ఆర్’ రాజమౌళి సినిమా కావడంతో బాలీవుడ్ లో కూడ ఈమూవీ పై బాగా ఆశక్తి పెరిగింది.
‘ఆర్ ఆర్ ఆర్’ ట్రైలర్ ను నిశితంగా పరిశీలిస్తే విపరీతమైన గ్రాఫిక్స్ మాయ ఉన్నట్లు అర్థం అవుతోంది. అయితే ‘ఆర్ ఆర్ ఆర్’ లోని హీరోలు మాత్రం ఆంధ్రా తెలంగాణ నేపధ్యం ఉన్న స్వాతంత్ర సమరయోధుల జీవిత స్ఫూర్తి. ఉత్తరాది ప్రాంతంలో అక్కడి ప్రజలకు అల్లూరి సీతారామరాజు కొమరం భీమ్ ల గురించి తెలియదు. స్వాతంత్రోద్యమ నేపధ్యంలో తీసిన భారీ బాలీవుడ్ మూవీ మణికర్ణిక కూడ అంతంత మాత్రం విజయాన్ని సాధించింది. దీనితో బాలీవుడ్ ప్రేక్షకులు ప్రభాస్ ప్రేమ కథకు సక్సస్ ఇస్తారా లేకుంటే రాజమౌళి గ్రాఫిక్స్ మాయాజాలానికి ముగ్ధులు అవుతారా అన్నది త్వరలో తేలిపోతుంది..