తారుమారు అవుతున్న బిగ్ బాస్ లెక్కలు.. ఆ కంటెస్టెంట్ కి పెరుగుతున్న మద్దతు..!!

VUYYURU SUBHASH
బిగ్ బాస్ సీజన్ 5 మరో రెండు వారాల్లో ముగియనుంది. దీంతో హౌస్ లోని కంటెస్టేంట్లకు టెన్షన్ మొదలైంది. అందరు బిగ్ బాస్ టైటిల్ విన్ అవ్వాలనే హౌస్ లోకి వచ్చారు. కానీ లాస్ట్ కి ఒక్కరే గెలవగలరు. ఆ ఒక్కరు ఎవరా..? అని రెండు తెలుగు రాష్ట్రాలో ఉన్న ప్రజలు ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు హౌస్ లో ఉన్న టాప్ 6 కంటెస్టెంట్స్ సన్నీ,షణ్ముఖ్, సిరి,కాజల్,శ్రీరామ చంద్ర, మానస్. వీళ్లలో ఖచ్చితంగా టాప్ 3 లో ఉండే హౌస్ మేట్స్ అయితే మాత్రం శ్రీరాం, సన్నీ, షణ్ముఖ్ అని తెలుస్తుంది. బయట వీళ్లకి ఫాలోయింగ్ కూడా అలానే ఉంది.

ఇక ఈ వారం ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఎకువువగా ఉన్న కంటెస్టేంట్ కాజల్ అన్నట్లు తెలుస్తుంది. ఎందుకంటే అవసరం ఉన్నా లేకున్నా ప్రతి విషయంలో ఇన్వాల్వ్ అవుతూ పక్క వాళ్ళను రెచ్చకొడుతుంది. దీంతో హౌస్ లోని మిగత హౌస్ మేట్స్ కి మధ్య గొడవలు వస్తున్నాయి. ఇక మిగతా కంటెస్టెంట్స్ తో పోలిస్తే కాజల్ కి ఉన్న ఫాలోయింగ్ కొంచెం తక్కువనే చెప్పాలి. దీంతో ఈ వారం కాజల్ హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే ఛాన్సులు చాలా ఎక్కువగా ఉన్నాయి.
ఇక ఫైనల్  టాప్ 2 లో ముఖ్యంగా ఇద్దరి కంటెస్టేంట్ల మధ్య గట్టి పోటీ ఉండబోతున్నట్లు బయట ప్రచారం చూస్తే అర్ధమౌతుంది. వాళ్లే సన్నీ-షణ్ముఖ్‌. ఈ ఇద్దరికి బయట మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. దీంతో ఇద్దరికి సరి సమానంగా ఓట్లు పోలైయే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఇప్పటి వరకు సన్నీ కే  విన్నర్  అయ్యే అవకాశాలు ఉన్నట్లు ప్రచారం జరగ్గా.. ఇప్పుడు ఆ లెక్కలు తారుమారు అయ్యాయి. అనూహ్యంగా తేర షణ్ముఖ్ కి సపోర్ట్ పెరిగింది.  షణ్ముఖ్ కి సెలబ్రిటీల సపోర్ట్ వస్తుంది. యూట్యూబర్స్ సపోర్ట్ ఉంది. కాగా ఇప్పటికే చాలా మంది స్టార్స్ షణ్ముఖ్‌ కి ఓటువేయండి అంటూ  రిక్వెస్ట్ చేస్తున్నారు. రీసెంట్ గా శ్రీరెడ్డి కూడా షణ్ముఖ్‌ కి ఓటు వేయమని కోరింది. అతడు డౌన్‌ టు ఎర్త్‌ అని చెప్పుతూ.. ఫేక్‌గా ఉండడు.. గేమ్‌ కూడా బాగా ఆడుతున్నాడు అతనికి ఓటు వేసి గెలిపించండి అంటూ వీడియో  రిలీజ్ చేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: