పవన్ కళ్యాణ్ మూవీలో పోలీస్ గా 'శివగామి' ?

VAMSI
సెకండ్ ఇన్నింగ్స్ ను మొదలు పెట్టిన సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ వరుస చిత్రాలతో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఆభరణాలు లేకున్నా, పట్టు చీరల్లో ధగ ధగ మెరవక పోయినా హుందాగా కనిపించే సౌందర్యం ఆమె సొంతం, తన నటనతో విమర్శకులను సైతం మంత్రముగ్ధుల్ని చేయగల అభినయం తనది. ఈమె త్వరలో 'బంగార్రాజు' చిత్రంతో మన ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే. కాగా ఇపుడు ఈమె నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి ఒక ఆసక్తికర వార్త అందరినీ ఆశ్చర్య పరుస్తోంది. ఈమె పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తదుపరి చిత్రంలో ఓ కీలక పాత్రకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది.
ఆ చిత్రంలో రమ్య కృష్ణ పవర్ఫుల్ పోలీస్ పాత్రలో కనిపించనున్నారని వినికిడి. ఈ సంవత్సరం రెండు పవర్ ఫుల్ పాత్రల్లో తెలుగు ప్రేక్షకులను అలరించి తన స్టామినాను మరో సారి నిరూపించుకున్నారు. రెండు సినిమాలు కూడా ఈ మధ్య విడుదల అయ్యాయి. అందులో ఒకటి సాయి ధరమ్ తేజ్ నటించిన 'రిపబ్లిక్' మూవీ కాగా ఇంకొకటి పూరి జగన్నాధ్ తనయుడు చేసిన 'రొమాంటిక్'. ఈ సినిమాలో రమ్యకృష్ణ పోలీస్ ఆఫీసర్ పాత్రలో ఒదిగిపోయిన విధానం అందరినీ ఎంతగానో ఆకట్టుకుంది. అందుకే ఇంకోపాత్ర కూడా పోలీస్ గెట్ అప్ అని తెలుస్తోంది.
పవర్ స్టార్ చిత్రంలో సీనియర్ హీరోయిన్ రమ్య కృష్ణ పేరు వినగానే ఈ రేర్ కాంబినేషన్ కి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇది నిజమేనా...ఖచ్చితంగా  వీరి కాంబోలో సినిమా రావాలని కోరుకుంటున్నారు. ఇక నటి రమ్యకృష్ణ చేతిలో ఇప్పటికే పలు చిత్రాలు లైన్ లో ఉన్నాయి. వయసు అయిదు పదులు దాటుతున్నా తరగని అందానికి అభినయాన్ని జోడించి ఇప్పటికీ సినీరంగంలో రాణిస్తున్నారు రమ్య. 1983 లోనే ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చిన రమ్య కృష్ణ  మొదట గ్లామరస్ పాత్రల్లో ఎక్కువ కనిపించే వారు, ఆ తరువాత విభిన్న పాత్రలను ఎంచుకుంటూ తనదైన నటనతో అభిమానుల సంఖ్యను పెంచుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: