బిగ్ బాస్ 5 : ఈరోజు ఎవరు ఎలిమినేట్ అవుతారంటే?

praveen
ప్రస్తుతం తెలుగు బుల్లితెర పై బిగ్గెస్ట్ సినీ సెలబ్రిటీ షో గా కొనసాగుతుంది బిగ్బాస్ కార్యక్రమం.. ఇక బిగ్బాస్ కార్యక్రమంలో ఉండే రియాలిటీ ప్రేక్షకులు అందరినీ ఆకర్షిస్తుంది. గత ఐదు సీజన్ల నుంచి కూడా తెలుగు బుల్లితెరపై సరికొత్త చరిత్ర సృష్టిస్తుంది. టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతుంది బిగ్బాస్ కార్యక్రమం. ఇక బుల్లితెర ప్రేక్షకులు అందరూ కూడా తమ ఇంటితో పాటు బిగ్బాస్ ఇంటిపై కూడా ఓ కన్నేసి ఉంచ డానికి ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. బిగ్బాస్ కార్యక్రమం వస్తుంది అంటే చాలు ప్రేక్షకులు టీవీలకు అతుక్కుపోతున్నారు. ఇక ప్రస్తుతం బిగ్ బాస్ ఐదవ సీజన్ చివరి అంకానికి చేరుకోవటంతో మరింత రసవత్తరంగా మారిపోయింది హౌస్ లో గేమ్.

 ప్రతి ఒక్కరూ ఫైనలిస్ట్ గా నిలవడానికి ఎంతో రసవత్తరంగా గేమ్ ఆడుతూ ఉండటం గమనార్హం.. కాగా 19 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన బిగ్బాస్ కార్యక్రమం లో ప్రస్తుతం కేవలం ఏడు మంది కంటెస్టెంట్స్ మాత్రమే కొనసాగుతున్నారు. ఇక గత వారం రవి ఎలిమినేషన్ తర్వాత బిగ్ బాస్ హౌస్ నుంచి ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నదానిపై కూడా క్లారిటీ లేకుండా పోయింది. అయితే గత వారం ఎలిమినేషన్ షాక్ నుంచి ఇంకా ప్రేక్షకులు కోలుకొనే లేదు అప్పుడే మరో ఎలిమినేషన్  సమయం వచ్చేసింది.. దీంతో ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అన్నది ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిపోయింది.

 అయితే 13వ వారానికి చేరుకున్న బిగ్బాస్ కార్యక్రమంలో ఇక ఈ వారం ప్రియాంక సింగ్ ఎలిమినేట్ కానుంది. ఇక ఈ రోజు జరగబోయే ఎపిసోడ్ లో ప్రియాంక హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే బయటికి రాబోతుంది. బిగ్ బాస్ హౌస్ లో మానస్ తో ఎమోషనల్గా కనెక్ట్ అయింది ప్రియాంక సింగ్. ఈ క్రమంలోనే గేమ్ పై ఫోకస్ పెట్టకపోవడంతో టాస్క్ లో కూడా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది. దీంతో తక్కువ ఓట్లు వచ్చిన కారణంగా ప్రియాంక సింగ్ హౌస్ నుంచి ఎలిమినేట్ అయింది అని టాక్ వినిపిస్తోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: