'డబ్బులు తీసుకోకుండా ఓటు వేసే దమ్ముందా'.... ప్రశ్నించిన 'లీడర్'

VAMSI
రాజకీయ రంగం...ఇదో పెద్ద చరదరంగం అనే చెప్పాలి. ప్రజలకు నచ్చాలే కానీ ఇక్కడి నాయకులకు సైతం హీరోలకు ఏమాత్రం తగ్గని క్రేజ్ ఉంటుంది. చాలా మంది నాయకులకు బిగ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇక రాజకీయం అనేది ప్రతి ఒక్క వ్యక్తికి ఎంతో కొంత తెలిసిన అంశం. చాలామందికి ఆసక్తికరమైన విషయం. ఎందుకంటే మన బ్రతుకు జీవనం ఇండైరెక్ట్ గా రాజకీయాల పైనే ఆధారపడి ఉంటున్నది తెలిసిన విషయమే. అందుకే అందరూ పొలిటికల్ న్యూస్ అంటే ఇంట్రెస్ట్ చూపెడుతుంటారు. రాష్ట్రం ఏదైనా పాలిటిక్స్ అంటే ఎపుడు హాట్ టాపిక్కే. ఈ క్రమంలో తెలుగు తెరపై కూడా ఎన్నో చిత్రాలు రాజకీయ నేపథ్యంలో రూపుదిద్దుకుని క్యాష్ చేసుకున్నాయి.
పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన దాదాపు అన్ని సినిమాలు విజయవంతం అయ్యాయి. కాగా ఇపుడు టాలీవుడ్ లో సక్సెస్ అందుకున్న పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో వచ్చిన రానా మూవీ లీడర్ గురించి ఓ లుక్కేద్దాం పదండి.  
లీడర్...దగ్గుబాటి రానా డెబ్యూ హీరోగా రాజకీయ నేపథ్యంలో వచ్చిన తొలి చిత్రం ఇది. రాజకీయాల్లో జరిగే అవినీతిని అరికట్టడానికి ఒక యువనాయకుడు చేసే పోరాటమే ఈ సినిమా. అవినీతిని అంతమొందించే  దమ్ము నాకుంది,
ప్రజల సొమ్మును ప్రజలకే పంచగలిగే దమ్ము నాకుంది. మరి ఒక్క రూపాయి తీసుకోకుండా ఓటు వేసే దమ్ము మీకుందా? అంటూ రానా చెప్పే పవర్ఫుల్ డైలాగ్ ప్రతి మనిషిని కదిలించింది. ఈ చిత్రం అన్ని వర్గాల ప్రేక్షకులను అలరించి బాక్స్ ఆఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచింది. రానా కెరియర్ కి స్టన్నింగ్ ఎంట్రీని ఇచ్చింది ఈ మూవీ.
సాధారణంగా సినీ బ్యాగ్రౌండ్ నుండి వచ్చే హీరోలు ఎవరైనా తమ మొదటి సినిమా విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటారు.
రిస్క్ అస్సలు తీసుకోరు. వీలైనంత వరకు ఫ్యామిలీ ఎంటర్టైనర్ లేదా లవ్ ఎంటర్టైన్మెంట్ కథాంశాలుగా ఉండే చిత్రాలను ఎంపిక చేసుకుంటారు. కానీ ఈ విషయంలో హీరో దగ్గుపాటి రానా పూర్తి భిన్నం అనే చెప్పాలి. రావడం రావడమే రాజకీయ నేపథ్యంలో అంటే...ఈ హీరో చేసిన డేర్ మరీ హీరో చేసి ఉండరేమో. అయిన తన లెక్క ఎపుడు తప్పలేదు.
వైవిధ్య భరితమైన చిత్రాలతో ఎప్పటికప్పుడు తెలుగు ప్రేక్షకులకు స్పెషల్ ట్రీట్ ఇస్తుంటారు ఈ హీరో. ఆ తర్వాత విభిన్నమైన కథలను ఎంచుకుంటూ సక్సెస్ ఫుల్ హీరోగా దూసుకెళ్తున్నారు రానా.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: