షణ్ముఖ్ కి షాక్.. వేరే కంటెస్టెంట్ కి ఓటు వేసిన దీప్తి?

praveen
ప్రస్తుతం బుల్లితెర ప్రేక్షకులందరి కన్ను బిగ్బాస్ కార్యక్రమం పైనే ఉంది. బిగ్గెస్ట్ సినీ రియాలిటీ షో గా కొనసాగుతున్న ఈ కార్యక్రమం ఎంతగానో అలరిస్తుంది. అయితే అటు తెలుగు బుల్లితెరపై కూడా ప్రస్తుతం ఐదవ సీజన్ ప్రసారం అవుతుంది అన్న విషయం తెలిసిందే. ఇక ఐదవ సీజన్ కూడా చివరి అంకానికి చేరుకుంది. దీంతో ఎంతో మంది ప్రేక్షకులు తమ అభిమాన కంటెస్టెంట్ లకు ఓట్లు వేసి మద్దతు తెలుపుతున్నారు. అయితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్ గా కొనసాగుతున్నాడు షణ్ముఖ్ జస్వంత్. షణ్ముఖ్ జశ్వంత్ కి ఎంతో మంది ఫాలోవర్లు కూడా ఉన్నారు.

 ఇక ఫాలోవర్స్ విషయం పక్కనపడితే అతని ప్రేయసి దీప్తి సునైనా కూడా ప్రస్తుతం సినీ సెలబ్రిటీగా కొనసాగుతుంది. శ్రీముఖి బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్ళినప్పటినుంచి షణ్ముఖ్ కి ఓట్లు వేసి గెలిపించాలని అంటూ దీప్తి సునైనా తన ఫాలోవర్లను అందరిని కూడా కోరింది. ఇక ఇటీవల ఒక వీకెండ్ ఎపిసోడ్ లో కూడా షణ్ముఖ్ ను సపోర్ట్ చేయడానికి బిగ్బాస్ స్టేజ్ మీదకి  కూడా వచ్చింది. అయితే ఇటీవల దీప్తి  ప్రియుడు షణ్ముక్ కృష్ణ అంతే కాకుండా మరో కంటెస్టెంట్ కి కూడా మద్దతు ఇస్తూనే ఉంది.

 అంతేకాదు మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ కు వేసిన ఓట్ కి సంబంధించిన స్క్రీన్షాట్ సైతం సోషల్ మీడియాలో ఖాతాలో పోస్ట్ చేయడం గమనార్హం. దీంతో దీప్తి సునైనా చేసిన పోస్ట్ కాస్త వైరల్ గా మారిపోయింది. ఇంతకీ దీప్తి సునైనా సపోర్ట్ చేసిన మరో బిగ్ బాస్ కంటెస్టెంట్ ఎవరు అని అనుకుంటున్నారు కదా.. అతను తెలుగు బిగ్ బాస్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్ కాదు తమిళ బిగ్ బాస్ హౌస్ లో కొనసాగుతున్న కంటెస్టెంట్.  ప్రస్తుతం తమిళంలో కూడా బిగ్బాస్ ఐదవ సీజన్ ప్రసారమవుతుంది. ఇక ఈ బిగ్ బాస్ హౌస్ లో వరుణ్ అనే కంటెస్టెంట్ వుండగా దీప్తి సునైనా అతనికి మద్దతు ప్రకటించి ఫాలోవర్స్ కూడా ఓట్లు వేయాలని సూచించింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: