గ్యాస్ లీకేజీ దుర్ఘటనపై.. వెబ్ సిరీస్.. హీరో ఎవరంటే?

praveen
ఇటీవల కాలంలో సినిమాల పంథా మారుతోంది. అటు సినిమా హీరోలు కూడా కొత్త దారులు తొక్కుతూ ఉండడం గమనార్హం. ఒకప్పుడు అయితే సినిమా అంటే కేవలం  రెండున్నర గంటలు ఉండి ఇక థియేటర్లలో విడుదల చేయాలి అని అనుకునే వారు. కానీ ఇప్పుడు మాత్రం కేవలం థియేటర్లు మాత్రమే కాదు అటు ఓటీటీ వేదికగా కూడా సినిమాలు విడుదల అవుతున్నాయి.  కరోనా వైరస్ సమయంలో అయితే ఓటీటీ ప్లాట్ఫామ్స్ ప్రేక్షకులందరికీ ఎంతో దగ్గరయ్యాయి. అంతేకాదు సినిమాల్లో కమర్షియల్ హంగులతో కూడిన పాత్రలో నటించే వాళ్ళు అటు ఓటిటి వేదికగా తెరకెక్కే వెబ్ సిరీస్ లో మాత్రం నటనకు ప్రాధాన్యమున్న పాత్రల్లో నటిస్తున్నారు. ఇలా వెండితెరపై స్టార్లుగా కొనసాగుతున్న వారు సైతం ఇక ఓటిటి వేదికగా ఒక సాదాసీదా నటుడిగానే నటిస్తూ ఉండటం గమనార్హం.

 ఇప్పటికే ఎంతో మంది స్టార్లు ఇలాంటి ఓటిటి వేదికగా తమ నటనను నిరూపించుకున్నారు.. ఇక ఇప్పుడు మరో స్టార్ హీరో కూడా ఓటిటీలో సత్తా చాటేందుకు సిద్ధమైయ్యడు. ఇటీవలి కాలంలో నిజజీవిత సంఘటనలు ఆధారంగా ఎన్నో సినిమాలు తెరకెక్కుతున్నాయి అన్న విషయం తెలిసిందే. కేవలం వెండి తెరపైనే కాదు ఓటీటీ వేదిక కూడా ఎన్నో వెబ్ సిరీస్ విడుదల అవుతూ ఉన్నాయి.  ఈ క్రమంలోనే తమిళ స్టార్ హీరో మాధవన్  నిజ జీవితం సంఘటన ఆధారంగా తెరకెక్కబోయే వెబ్ సిరీస్ లో నటించేందుకు సిద్ధం అయ్యాడట.

 సరిగ్గా 37 ఏళ్ల క్రితం భూపాల్ లో జరిగిన గ్యాస్ దుర్ఘటన గురించి ఇప్పటికీ ఎవరూ మర్చిపోలేరు. ఏకంగా 3800 మంది ని ఈ గ్యాస్ దుర్ఘటన బలితీసుకుంది. అయితే ఇక ఈ దుర్ఘటన పైనే వెబ్ సిరీస్ తెరకెక్కించబోతున్నారు.. మాధవన్ ప్రధానపాత్రలో ది రైల్వే మెన్ ది అన్ టోల్డ్ స్టోరీ అనే పేరుతో ఇక ఈ వెబ్ సిరీస్ తెరకెక్కించబోతున్నారు. గ్యాస్ దుర్ఘటన లో ప్రాణాలు అర్పించిన రైల్వే ఉద్యోగులకు ఈ వెబ్ సిరీస్ లో  నివాళి అర్పిస్తున్నామని చిత్ర బృందం తెలిపింది. అయితే ఇక ఈ వెబ్ సిరీస్ యష్ రాజ్ తొలి ఓటిటీ ప్రాజెక్ట్ కావడం గమనార్హం. ఇందులో నటించడం గర్వంగా ఉంది అంటూ మాధవన్ చెప్పుకొచ్చాడు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: