
పూరీ జగన్నాథ్-హేమ మధ్య ఉన్న రిలేషన్ ఏంటో తెలుసా..?
సాధారణంగా మనం ఉన్న సమాజంలో ఒక అమ్మాయి, ఒక అబ్బాయి స్నేహంగా ఉన్నారు అంటే వాళ్లు లవ్ చేసుకుంటున్నారని అనుకుంటారు. అదే అమ్మాయికి అబ్బాయికి పెళ్లి అయిపోయుంటే ..వాళ్ల మధ్య ఏదో అక్రమ సంబంధం ఉంది అంటూ లేని పోని పుకార్లు పుట్టించే మనుషులు ఇంకా ఈ భూమి మీద ఉన్నారు అనడంలో ఏమాత్రం సందేహం లేదు. ఇక ఇలాంటి పుకార్లు ఎక్కువ మనం సినీ ఇండస్ట్రీలో చూస్తుంటాం. ఇక అలా మంచి ఫ్రెండ్స్ గా ఉన్న హేమ-పూరీ జగన్నాథ్ పై ఎన్నో తప్పుడు వార్తలు హల్ చల్ చేసాయి. ఒక సినిమా ఫంక్షన్ ఈవెంట్ లో భాగంగా కలిసిన వీరు..స్టెజీ పైన అందరు ఉండగానే హేమ పూరీ తో సరదాగా మాట్లాడుతూ.. పూరీ జగన్నాథ్ నడుముపై గట్టిగా గిల్లిందట.
దీంతో అక్కడున్న వారంత ఇది చూసి వీళ్ళ మధ్య ఏదో ఎఫైర్ ఉందని అనుకున్నారట. వీళ్ల మధ్య ఉన్న చనువు చూసి..ఒకానొక దశలో పూరీ జగన్నాథ్ ఆయన భార్య కు విడాకులు ఇచ్చేసి..హేమ ను పెళ్లి చేసుకుంటున్నారంటూ కూడా వార్తలు రావడం గమనార్హం. కానీ, వీళ్లు ఎప్పుడు కూడా ఇలాంటి వార్తలు పై స్పందించలేదు. ఎదుటి వాళ్లు ఎలా అనుకున్నా మాకు సంబంధం లేదు అన్నట్లు వీళ్ల ఫ్రెండ్ షిప్ ని ఇప్పటికి కొనసాగిస్తున్నారు. అయితే సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి గాసిప్స్ కామన్ అంటూ వీళ్లిద్దరు కొట్టిపడేసారట. ఇక పూరీ జగన్నాథ్ తెరకెక్కించిన చాలా సినిమాలో హేమకు మంచి లీడ్ రోల్ ఇచ్చారు. ప్రస్తుతం డైరెక్టర్ పూరీ జగన్నాథ్ విజయ్ దేవరకొండ తో "లైగర్" అనే సినిమాను తెరకెక్కిస్తున్నాడు.