అలా అదరగొడుతున్న రీతూ వర్మ..!

Pulgam Srinivas
తెలుగమ్మాయి రీతూ వర్మ, విజయ్ దేవరకొండ హీరో గా తరుణ్ భాస్కర్ దర్శకత్వం లో తెరకెక్కిన పెళ్లి చూపులు సినిమా తో వెండి తెరకు పరిచయం అయింది,  ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయం సాధించడం తో పాటు ఈ ముద్దు గుమ్మ నటనకు కూడా ప్రేక్షకుల నుండి మంచి మార్కులు పడటం తో రేపు వర్మ కు టాలీవుడ్ లో మంచి సినిమా అవకాశాలు దక్కాయి, అందులో భాగంగా కేశవ, టచ్ జగదీష్ లాంటి సినిమాల్లో నటించి మెప్పించిన ఈ ముద్దు గుమ్మ తెలుగు తో పాటు తమిళం లోనూ హీరోయిన్ గా నటించి మెప్పించింది. ఇది ఇలా ఉంటే కొన్ని రోజుల క్రితమే నాగ శౌర్య హీరో గా తెరకెక్కిన వరుడు కావలెను సినిమా లో నటించిన రీతు వర్మ ఈ సినిమాతో ప్రేక్షకులను అలరించింది.

ఇలా సినిమా లతో ఫుల్ బిజీ గా సమయాన్ని గడుపుతున్న రీతు వర్మ సోషల్ మీడియా లో కూడా ఫుల్ యాక్టివ్ గా ఉంటూ తన అభిమాను లతో అనేక విషయాలను పంచుకుంటూ ఉంటుంది, ఇది మాత్రమే కాకుండా ఈ ముద్దు గుమ్మ తన సినిమా షూటింగ్ అప్డేట్స్ ను, తన డైలీ యాక్టివిటీస్ ను కూడా తన అభిమాను లతో పంచుకుంటూ ఉంటుంది, అలాగే అప్పు డప్పుడు తన హాట్ హాట్ అందాలతో కూడిన ఫోటోలను కూడా తన సోషల్ మీడియా అకౌంట్ లో అప్లోడ్ చేస్తూ ఉండే ఈ హాట్ బ్యూటీ తాజా గా కూడా ఒక ఫోటో ను అప్లోడ్ చేసింది. ఈ ఫోటోలో రీతూ వర్మ చేంకి లు పొదిగిన డ్రెస్ వేసుకొని అదిరిపోయే లుక్ లో కూర్చొని ఫోటోలకు స్టిల్స్ వచ్చింది, రీతు వర్మ కు సంబంధించిన ఈ ఫోటో నెట్టింట్లో వైరల్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: