బుచ్చిబాబు టాలెంట్ ఏమిటో అప్పుడే డిసైడ్ అయితే ఎలా?

VAMSI
ఒక్క చిత్రంతో ఓవర్ నైట్ లో ఎనలేని క్రేజ్ తెచ్చుకున్న దర్శకుడిగా గుర్తింపు పొందారు దర్శకుడు బుచ్చిబాబు సన. అప్పటి వరకు స్టార్ డైరెక్టర్ సుకుమార్ వద్ద ప్రియ శిష్యుడిగా ఉంటూ ఆయన చిత్రాలకు అసిస్టెంట్ డైరెక్టర్ గా పని చేసిన బుచ్చిబాబు 'ఉప్పెన' చిత్రంతో తన డైరెక్షన్ టాలెంట్ ఏమిటో ఈ లోకానికి తెలియచెప్పాడు. కటౌట్ కాదు కంటెంట్ చూసి నమ్మేయాలి బ్రో అంటారు ఈ డైరెక్టర్. అసిస్టెంట్ డైరెక్టర్ నుండి డైరెక్టర్ గా మారి తన తొలి సినిమా 'ఉప్పెన' తో వసూళ్ల సునామీ పొంగించిన ఈ దర్శకుడు పనితనం చూసి టాలీవుడ్ మొత్తం నివ్వెర పోయింది. మొదటి చిత్రం తోనే వందకోట్ల కలెక్షన్స్ రాబట్టారు అంటే అంత చిన్న విషయం కాదు.
అది కూడా ఫేమ్ ఉన్న హీరోతో హిట్ కొట్టలేదు. ఈ సినిమాతో తన కెరీర్ ను మొదలెట్టిన హీరో మరియు హీరోయిన్ లతో చేసిన తొలి ప్రయత్నం కావడం విశేషం. ఈ సినిమాతో మెగా ఇంటి కుర్రాడు వైష్ణవి తేజ్ హీరోగా పరిచయం కాగా, అందాల రాసి కృతి శెట్టి హీరోయిన్ గా పరిచయం అయింది. ఇక ఈ చిత్రంలో విభిన్న నటుడు విజయ్ సేతు పతి ప్రతినాయకుడి పాత్రను పోషించిన విషయం తెలిసిందే. అనుకున్న సీన్ అనుకున్నట్లుగా వచ్చే వరకు అస్సలు నిద్రపోడట దర్శకుడు బుచ్చిబాబు. ఆ నిబద్దతే అతనికి అంత మంచి గుర్తింపును తెచ్చిపెట్టింది. ఇక ఈ సినిమా తరువాత డైరెక్టర్  బుచ్చిబాబు నెక్స్ట్ ప్రాజెక్ట్ ఏంటి అన్న ఆసక్తి అందరిలోనూ మొదలయ్యింది.
జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు అంటూ పలు స్టార్ ల పేర్లు వినిపించాయి కానీ ఇప్పటి వరకు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ డీటెయిల్స్ గురించి అనౌన్స్ చేయలేదు డైరెక్టర్ బుచ్చిబాబు. అయితే రెండవ సినిమా హిట్ అయితే కానీ చెప్పలేము. బుచ్చిబాబు లో ఎంత పస ఉందో, మరి చూద్దాం ఎటువంటి కథతో మన ముందుకు రానున్నాడో...?

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: