ప్రియాంక చోప్రా.. అందుకే భర్త పేరు తొలగించిందట?

praveen
సాధారణంగా సినిమా ఇండస్ట్రీ లో ఉండే భార్యాభర్తలకు ఎంతో క్రేజ్ ఉంటుంది. అది కూడా ఇక ప్రేమ పెళ్లి చేసుకున్నారు అంటే  చాలు వారు ఎక్కడైనా కనిపిస్తే ఇక ప్రేక్షకులందరూ మురిసిపోతూ ఉంటారు. అయితే ఇక ప్రస్తుతం బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో ఇలా ప్రేక్షకులు అందరినీ ఆకర్షించే ప్రేమజంటగా ప్రియాంక చోప్రా నీక్ జోనాస్ జంట కొనసాగుతోంది. తన కంటే చిన్నవాడైన నిక్ జోనాస్ ని పెళ్లి చేసుకున్న ప్రియాంక చోప్రా అప్పట్లో వార్తల్లో హాట్ టాపిక్ గా మారిపోయింది. వీరు ఎక్కడ కనిపించినా కూడా ఒకరిపై ఒకరు అమితమైన ప్రేమను చూపిస్తూ ఉంటారు.

 అయితే ఇలాంటి ప్రేమ జంట ఇక విడాకులు తీసుకుని విడిపోతున్నారు  అన్న టాక్ ఇటీవలికాలంలో వినిపించింది. ఇటీవలే తన సోషల్ మీడియా హ్యాండిల్ పేరును మార్చింది ప్రియాంక చోప్రా.  తన పేరు తో కలిసి ఉన్న భర్త పేరును తొలగిస్తూ ప్రియాంక చోప్రా అనే పేరును మాత్రమే సోషల్ మీడియా హ్యాండ్ కు కొత్త పేరు గా పెట్టింది. గతంలో ఇలాగే పేరు మార్చుకున్నా సమంత కొన్ని రోజుల్లోనే తన భర్త నాగచైతన్యకు విడాకులు ఇచ్చింది. ఇప్పుడు ప్రియాంక చోప్రా కూడా విడాకులు ఇవ్వబోతోందా అన్నా టాక్ మొదలయింది. అయితే ప్రియాంక చోప్రా నిక్ జోనస్ కు ఎలాంటి విడాకులు ఇవ్వడం లేదని ప్రియాంక తల్లి స్పష్టం చేసింది. ఇక ఇటీవల నిక్ షేర్ చేసిన ఒక వీడియో కి ప్రియాంక కామెంట్ పెట్టి రూమర్లకు చెక్ పెట్టింది.

 దీంతో అసలు ప్రియాంక ఎందుకు పేరు మార్చింది అన్న దానిపై మాత్రం అందరూ వెతకడం ప్రారంభించారు. ప్రస్తుతం అసలు విషయం ఏంటి అన్న దానిపై మరొక టాక్ వినిపిస్తోంది. ఈ కాలంలో ఎంతో మంది సినీ సెలబ్రిటీలు జ్యోతిష్యం న్యూమరాలజీ ఎక్కువగా నమ్మడం మొదలు పెడుతున్నారు.. న్యూమరాలజీ ప్రకారమే  ప్రియాంక చోప్రా తన భర్త పేరును తొలగించిందట. న్యూమరాలజీ ప్రకారం తన పేరు పక్కన భర్త పేరు ఉంటే కలిసి రాదని అందుకే జోనస్ అనే పదాన్ని తొలగించిందని టాక్ వినిపిస్తోంది. ఇక మరో వైపు ఒక ఛాలెంజ్ లో భాగంగానే ప్రియాంక చోప్రా ఇలా భర్త పేరును తన సోషల్ మీడియా హ్యాండిల్స్ నుంచి తొలగించింది అంటూ మరికొంతమంది చర్చించుకుంటున్నారు. ఏది నిజం అని తెలియాలంటే మాత్రం ఈ జంట లో ఎవరో ఒకరు స్పందించి అసలు విషయం చెప్పాల్సి ఉంది..

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: