
ఎలుకలు పట్టడం కోసం ట్రైనింగ్ తీసుకొని.. వాటి రుచి చూసిన హీరోయిన్..!!
ఇకపోతే ఈ హీరోయిన్ రాజన్న భార్య పార్వతి పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించడమే కాకుండా తన పాత్రతో మంచి గుర్తింపు తెచ్చుకుంది.. ఇకపోతే ఆమె ఈ పాత్రలో నటించడానికి చాలా కష్ట పడినట్లు రీసెంట్గా ఒక ఇంటర్వ్యూలో తెలపడం గమనార్హం.. లిజో మాట్లాడుతూ.. దర్శకుడు జ్ఞానవేల్ నాకు కథ చెప్పగానే పాత్రలో ఉన్న ఇంటెన్సిటీ నేను అర్థం చేసుకున్నాను.. నాకు ఆ పాత్ర చాలా బాగా నచ్చింది.. ఇక అందుకోసమే ఎంత కష్టమైనా సరే పడాలని నిర్ణయించుకున్నాను..
ఇక అందులో భాగంగానే డైటింగ్ చేసి బరువు కూడా తగ్గాల్సి వచ్చింది.. ముఖ్యంగా నేను చేసింది ఒక గిరిజన స్త్రీ పాత్ర..అది అంత సులభంగా ఎవరు చేయలేరు.. అయితే నేను ఆ పాత్రలో మంచి గుర్తింపు తెచ్చుకోవడం కోసం గిరిజన తెగకు చెందిన మహిళలను కలిసి వారితో కొద్ది రోజులు నేను కూడా గడిపాను.. అంతేకాదు పాముకాటుకు ఎలాంటి చికిత్స చేస్తారు.. ఆ సమయంలో ఎలాంటి ఔషధాలను ఉపయోగిస్తారు అనే విషయాలను కూడా నేను ఆ మహిళల నుంచి తెలుసుకున్నాను..
అంతేకాదు వారి దగ్గర నుంచి ఎలుకలు ఎలా పట్టాలో కూడా నేర్చుకొని ,వారు ఎలా పడుతున్నారో ట్రైనింగ్ కూడా తీసుకున్నాను..అంతే కాదు ఒకసారి ఎలుక మాంసం నేను రుచి చూశాను అంటూ ఆమె తెలిపింది.