బాలయ్య - ఎన్టీఆర్ కాంబినేషన్లో మాస్ సినిమా వస్తే ..!!

Divya
సాధారణంగా ఇద్దరు స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటిస్తున్నారు అంటే ఆ సినిమాను మల్టీస్టారర్ గా తెరకెక్కించడానికి దర్శకుడు ప్రయత్నం చేస్తారు. ముఖ్యంగా ఆ ఇద్దరు స్టార్ హీరోల చేత పౌరాణిక సినిమాలు.. లవ్ స్టోరీ గా లేక దేశభక్తి నేపథ్యంలో గాని సినిమాలను తెరకెక్కించాలని చూస్తూ ఉంటారు. అయితే ఇప్పటి వరకు ఇద్దరు స్టార్ హీరోలు అది కూడా మాస్ హీరోల చేత మరో మాస్ సినిమా తీస్తే ఎలా ఉంటుందో అనే ఆలోచన దర్శకులకు వచ్చిందో లేదో తెలియదు కానీ ఇప్పటివరకు అయితే అలాంటి సినిమాను తెరకెక్కించ లేదనే చెప్పాలి. అలా మాస్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న నటసింహం బాలకృష్ణ.. జూనియర్ ఎన్టీఆర్ తమ సినిమాలతో మాస్ ఆడియన్స్ ని బాగా ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే.


ఇక అలాంటి ఈ మాస్ హీరోలు ఇద్దరూ కలసి మరో మాస్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా కనుక  తెరకెక్కిస్తే,  ఆ సినిమా  కచ్చితంగా బ్లాక్ బాస్టర్ విజయాన్ని అందుకోవడమే కాకుండా తెలుగు సినీ ఇండస్ట్రీలో మరో సంచలనం సృష్టిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. సాధారణంగా ఇండస్ట్రీలో వీరిద్దరి కాంబినేషన్లో సినిమా రావాలి అని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. ఇక శివ లాంటి బ్లాక్ బాస్టర్ మాస్ సినిమాను తెరకెక్కించిన రామ్ గోపాల్ వర్మ లాంటి దర్శకుడు మరోసారి వీరిద్దరి తో మంచి యాక్షన్ సినిమాను మాత్రం తెరకెక్కిస్తే  ఖచ్చితంగా ఆ సినిమా సూపర్ హిట్ ను అందుకుంటుంది.


ఇక అందుకే వీరిద్దరి కాంబినేషన్లో ఒక పక్క మాస్ మూవీ రావాలని అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్నారు. కాకపోతే వీరిద్దరు కూడా జోడి హీరోయిన్లను తీసుకొచ్చి మాస్ మూవీని తెరకెక్కిస్తే ప్రేక్షకులకు కనువిందు చేయడమే కాకుండా కాసుల సునామి కురిపిస్తుంది అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. రాంగోపాల్ వర్మ వీరిద్దరి కాంబినేషన్లో ఒక సినిమా తెరకెక్కిస్తే చాలా బాగుంటుంది అని సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: