పవన్ తో రవితేజ మల్టీస్టారర్.. ఇక రచ్చ రచ్చే?

praveen
ఇటీవలి కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ సినిమాలు  అంతకంతకూ పెరిగిపోతున్నాయి. మొన్నటి వరకూ ఇండివిడ్యువల్  సినిమాలు తీసిన స్టార్ హీరోలు సైతం ఊహించని విధంగా మల్టీస్టారర్ చేసేందుకు సిద్ధమవుతున్నారు. అయితే ఇప్పటికే ఎన్నో మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కుతున్నాయి. ఓవైపు వెంకటేష్ వరుణ్ తేజ్ హీరోగా ఎఫ్ 3 సినిమా తెరకెక్కుతోంది. మరోవైపు  మెగాస్టార్ చిరంజీవి మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా ఆచార్య అనే సినిమా మల్టీస్టారర్ గా తెరకెక్కుతుంది.


 అదే సమయంలో జూనియర్ ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోగా ఆర్ఆర్ఆర్ అనే ఒక భారీ బడ్జెట్ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. అయితే ఇలా ఇన్ని సినిమాలు తెరకెక్కుతున్నప్పటికీ అటు ప్రేక్షకులు మాత్రం మరికొన్ని సినిమాలు మల్టీస్టారర్ గా వస్తే బాగుండు అని కోరుకుంటూ ఉంటారు. ఇలా ప్రేక్షకులు ఎక్కువగా కోరుకునే మల్టీస్టారర్ లో పవన్ కళ్యాణ్ రవితేజ కాంబినేషన్ కూడా ఒకటి. ఇక ఇద్దరు ఎవరికి వారు తమదైన శైలిలో ప్రేక్షకులను అలరిస్తూ ఉంటారు అన్న విషయం తెలిసిందే. ఒకవేళ వీరిద్దరూ కలిసి మల్టీస్టారర్ సినిమాలో నటిస్తే ఇక వీరిద్దరి కామెడీ టైమింగ్ బాగా సెట్ అయ్యే అవకాశం ఉందని  తెలుగు ప్రేక్షకులు భావిస్తున్నారు.



 అంతేకాదండోయ్ తనకు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తో కలిసి మల్టీస్టారర్ సినిమాల్లో నటించాలని ఉంది అంటూ ఇప్పటికే రవితేజ కూడా ఓ ఇంటర్వ్యూలో చెప్పడం గమనార్హం. మా ఇద్దరి ఎనర్జీ సినిమాల్లో మ్యాచ్ అవుతుంది అని అనిపిస్తూ ఉంటుంది. అందుకే పవన్ కళ్యాణ్ తో మల్టీస్టారర్ చేయాలని ఉంది అంటూ చెప్పాడు రవితేజ. అటు ప్రేక్షకుల్లో కూడా వీరిద్దరి కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ వస్తే బాగుండు అని అనుకుంటున్నారు. ఇక ప్రస్తుతం భారీగా మల్టీస్టారర్ సినిమాలు తెరకెక్కుతున్న నేపథ్యంలో ఇక రానున్న రోజుల్లో వీరి కాంబినేషన్లో ఓ మల్టీ స్టారర్ వచ్చే అవకాశం కూడా లేకపోలేదు అంటున్నారు విశ్లేషకులు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: