స్టేజి మీదే ఏడ్చేసిన ప్రముఖ హీరో.. కారణం..?

Divya
తమిళ సినిమా పరిశ్రమ గురించి మనకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. అక్కడ ఉన్నటువంటి స్టార్ హీరోలలో శింబు కూడా ఒకరు. అలాంటి స్టార్ హీరో హోదాలో ఉన్న ఈయన ఇటీవల కాలంలో ఎప్పుడూ లేనంతగా రియాక్ట్ కావడంతో ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. ఇంతకూ ఈ హీరో అలా ఎందుకు ఇబ్బంది పడ్డాడో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.
తాజాగా హీరో శింబు నటించిన సినిమా "మనాడు". ఈ సినిమా ఈనెల 25వ తేదీన విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమా సంబంధించి ప్రెస్ మీట్ కూడా నిర్వహించడం జరిగింది. ఈ సినిమాకి డైరెక్టర్ గా పని చేశాడు వెంకట్ ప్రభు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ గా ప్రియదర్శని నటించింది. ఇందులో ముఖ్యమైన పాత్రలో ఎస్.జె.సూర్య వంటి వారు కూడా నటించారు. ఇక ఈ సినిమా విడుదల చేయడానికి ముందు ఒక మీడియా సమావేశం జరిగింది. అందులో శంభో కొన్ని సరదా విషయాలతో మొదలుపెట్టి.. ఆ తర్వాత ఒక్కసారిగా ఎమోషనల్ అయ్యాడు.
ఆ తరువాత తను ఎన్నో కష్టాలను పడ్డానంటు కన్నీళ్లు తెచ్చుకున్నాడు.డైరెక్టర్ వెంకట్ తో ఎప్పటి నుంచో ఒక్క సినిమాలోనైనా నటించాలనుకున్నాను, తాజాగా మనాడు సినిమా ద్వారా తన కోరిక నెరవేరిందని చెప్పుకొచ్చాడు శింబు. తను కథ చెప్పినప్పుడు కేవలం ఒక లైన్ కథ ను విని కథ ఓకే చెప్పాను అని చెప్పుకొచ్చాడు. ఈ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాను కూడా చెప్పుకొచ్చాడు.
అయితే ఈ సినిమా షూటింగ్ నుంచి ఎన్నో సమస్యలు తనను  చుటుముట్టాయని తెలియజేశాడు. సమస్యలను నేను చూసుకుంటాను కానీ, తనని మాత్రం తన అభిమానులు చూసుకోవాలని కన్నీరు కార్చుకుంటూ తెలియజేశాడు. హీరో శింబుని అలా చూసి అక్కడున్న వారంతా ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు.కానీ తన పడుతున్న కష్టాలు ఏమిటన్నది మాత్రం తెలియజేయలేదు. ఇక దీనితో కొంతమంది అక్కడున్న ప్రముఖులు ఆయనని ఓదార్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: