ఎన్టీఆర్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేసిన శ్రీ విష్ణు..!

murali krishna
ఇండస్ట్రీలో పెద్ద కుటుంబాలలో ప్రధమంగా వినపడే పేరు నందమూరి ఫ్యామిలీ అన్న విషయం అందరికి తెలుసు. ఈ క్రమంలో నందమూరి కుటుంబం నుండి ఇండస్ట్రీలో పెద్ద హీరోలుగా చెలామణి అవుతున్నది బాలయ్య బాబు మరియు ఎన్టీఆర్(NTR).

ఇద్దరికీ కూడా మంచి మాస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని ఇద్దరి హీరోల సినిమాలు రిలీజ్ అయినాయి అంటే చాలు బాక్సాఫీస్ దగ్గర కనక వర్షం కురుస్తూ ఉంటుందని అందరికి తెలుసు.ఆ రీతిగా ఇద్దరి హీరోలకు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందని తెలుస్తుంది. ఇటువంటి తరుణంలో ఇండస్ట్రీలో ప్రస్తుతం రాణిస్తున్న కుర్ర హీరోలలో కూడా చాలామంది బాలయ్య బాబు లేదా ఎన్టీఆర్ అంటే పిచ్చి అభిమానం ఉన్న హీరోలు ఉన్నారట.

ఇప్పుడు ఇదే రీతిలో తాజాగా మరో కుర్ర హీరో బాలయ్య బాబు మరియు ఎన్టీఆర్ అంటే తనకి ఇష్టమని బహిరంగ వేదికగా చెప్పుకొచ్చారట.ఆ కుర్ర హీరో మరెవరో కాదు శ్రీ విష్ణు అని తెలుస్తుంది.తాజాగా శ్రీ విష్ణు నటించిన “అర్జున ఫల్గణ”సినిమా ప్రమోషన్ కార్యక్రమం.. మల్లారెడ్డి విద్యాసంస్థలలో జరిగిందట.ఈ సందర్భంగా శ్రీ విష్ణు మాట్లాడుతూ.. “అర్జున ఫల్గుణ” సినిమా 100% ఎంటర్టైన్మెంట్ సినిమా అని కాకపోతే సినిమాలో ఎన్టీఆర్ అభిమానిగా తాను నటించడం జరిగిందని సినిమాల ట్విస్టులు బావుంటాయని చెప్పుకొచ్చాడట.

 

ఖచ్చితంగా ఈ సినిమా మీ అందరికీ నచ్చేలా ఉంటుందని స్టూడెంట్ గా అదే రీతిలో ఎన్టీఆర్ అభిమాని గా తన క్యారెక్టర్ ఉన్నట్లు శ్రీ విష్ణు తెలిపారట.ఇదే సమయంలో స్టూడెంట్ లలో ఒకరు ఎన్టీఆర్ అభిమాని గా నటిస్తున్నారు కాబట్టి మీకు ఎన్టీఆర్ లో నచ్చే క్వాలిటీ ఏంటి..? అని ప్రశ్నించగా.. దానికి శ్రీ విష్ణు సమాధానమిస్తూ ఎన్టీఆర్ పేరు చెపితే ఫ్యాన్స్ నుండి వినబడే కేకలు మరియు అరుపులు ఆ వైబ్రేషన్స్ అంటే తనకు ఎంతగానో ఇష్టమని తనదైన శైలిలో చెప్పుకొచ్చాడట. దీంతో సభ ప్రాంగణం ఎన్టీఆర్ పేరుతో దద్దరిలిపోయిందని తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: