నయనతార నటించిన మొదటి తెలుగు సినిమా ఇదే..??
అయితే నయనతార తెలుగు చిత్ర పరిశ్రమలో మలయాళ సినిమాతో వెండితెరపై మెరిసినా రజినీకాంత్ తో నటించిన చంద్రముఖి సినిమా రిలీజ్ అయ్యే వరకూ తెలుగు ఆమె ఎవరో కూడా తెలియదు. ఆమె తన మొదటి సినిమాలో డీసెంట్ గా కనిపించిన నయనతర గజినీ సినిమాలో గ్లామర్ పాత్రలో కనిపించి అందరికీ షాక్ కి గురి చేసింది. అంతేకాదు.. నెమ్మదిగా తన రేంజ్ పెంచుకుంటూ వెళ్లిన నయనతార, తెలుగు తమిళ మలయాళ భాషల్లో అందరు స్టార్ హీరోలతో జత కట్టింది. చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక మార్కెట్ వచ్చింది అనుకున్న తర్వాత నయన్, సోలో హీరోయిన్ గా సినిమాలు చేస్తూ క్రేజ్ ని సంపాదించుకుంది.
అంతేకాదు.. సోలో హీరోయిన్ గా సినిమాలు చేయడం మొదలుపెట్టిన తర్వాత నయన్ పైన ఎన్నో విమర్శలు అందుకుంది. ఆమె వాటిని తట్టుకోని బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేసిన నయనతార, లేడీ సూపర్ స్టార్ గా రాణిస్తున్నది. అయితే ఒకప్పుడు కమర్షియల్ సినిమాల్లో హీరోయిన్ గా కనిపించిన మలయాళీ అమ్మాయి ఇప్పుడు కోలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా టాప్ పొజిషన్ ని ఎంజాయ్ చేస్తుంది. అంతేకాదు.. దాదాపు ఆరేడేళ్లుగా అదే పొజిషన్ లో ఉన్న నయనతార సినిమా రిలీజ్ అవుతుంది అంటే టాప్ హీరోలు కూడా వాళ్ల సినిమాలని వాయిదా వేసుకునే పరిస్థితి తీసుకొచ్చింది ఈ భామ.