ప్రిన్స్ మహేష్ బాబు చేస్తున్న సేవ "అజరామరం"...

VAMSI
సూపర్ స్టార్ మహేష్ బాబు రీల్ లైఫ్ లోనే కాదు రియల్ లైఫ్ లోనూ ఉత్తమ పురుషుడే. మానవతా దృక్పథం వున్న గొప్ప మనిషి. శ్రీమంతుడు చిత్రంలో ఒక ఊరిని దత్తత తీసుకుని ఆ ఊరి రూపు రేఖలను మార్చి ఎంతో అందంగా, సౌకర్యవంతంగా స్కూళ్లు, హాస్పిటల్స్ ఇలా అన్ని వసతులను తీర్చి దిద్దిన  మహేష్, నిజ జీవితంలో కూడా తెలుగు రాష్ట్రాలలో రెండు గ్రామాలను దత్తత తీసుకొని వాటి అభివృద్ధి కొరకు తనవంతు కృషి చేస్తున్నారు. బుర్రెపాలెం, మరియు సిద్దాపూర్ అనే రెండు గ్రామాలను దత్తత తీసుకుని. ఆ గ్రామాల అభివృద్ధి బాధ్యతను తన భుజాలపై వేసుకున్నారు. ఆ గ్రామాల అభివృద్ధికి అలాగే గ్రామ ప్రజల సంక్షేమాన్ని ఇలా ప్రతి ఒక్క అవసరాన్ని చూస్తున్నారు.

అంతే కాకుండా ఆంధ్ర హాస్పిటల్స్ ఆధ్వర్యంలో ఎందరో చిన్నారుల జీవితాల్లో వెలుగులు నింపే ప్రయత్నం చేస్తున్నారు. గుండె సంబంధిత జబ్బులతో బాధపడుతూ ఆర్థిక సహాయం కోసం ఎదురు చూసే ఎందరో  చిన్నారులకు నేనున్నానంటూ ముందుకొచ్చి వారి ఆపరేషన్ కి అయ్యే ఖర్చు అంతా కూడా తానే భరించారు. ఇప్పటి వరకు అలా ఎందరో చిన్నారులకు ప్రాణం పోశారు. అలాగే ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నారు. అదే విధంగా ప్రతి ఏడు తండ్రి కృష్ణ, తనయుడు గౌతం, అలాగే తన పుట్టిన రోజులు పురస్కరించుకొని తెలుగు రాష్ట్రాల్లోనూ సేవా కార్యక్రమాలు చేపడుతుంటారు మహేష్ బాబు మరియు ఆయన సతీమణి నమ్రత ఘట్టమనేని.

ఇలా పలు సేవా కార్యక్రమాలు చేస్తున్నా కూడా పబ్లిసిటీకి మాత్రం ఎప్పుడూ దూరంగానే ఉంటారు. తాను చేసే సాయం అవససరంలో ఉన్న వారికి అందితే చాలు అందుకు ప్రచారం, ప్రశంసలు అవసరం లేదు అనే గొప్ప మనసున్న వ్యక్తి మహేష్. హీరోగానే కాదు మంచి మనిషిగా కూడా తాను నిజంగా ప్రిన్స్ అనిపించుకుంటున్నారు
మహేష్ బాబు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: