జబర్దస్త్ నరేష్ ఆ అమ్మాయికి లైన్ వేస్తున్నాడా?

praveen
ప్రస్తుతం ఈ టీవీలో ప్రసారమయ్యే జబర్దస్త్ కార్యక్రమం బుల్లితెరపై కామెడీకి కేరాఫ్ అడ్రస్ గా మారిపోయింది. కేవలం బుల్లితెర ప్రేక్షకులను మాత్రమే కాదు వెండితెర ప్రేక్షకులను కూడా తెగ ఆకర్షిస్తుంది ఈ షో. ఒకప్పుడు బుల్లితెరపై ఎన్ని కామెడీ షోస్ వచ్చినప్పటికీ వెండి తెరపైఎప్పుడు వినూత్నమైన కామెడీ దొరుకుతుంది అని అనుకునేవారు ప్రేక్షకులు. కానీ ఇప్పుడు మాత్రం వెండితెర కంటే ఎక్కువగా అటు బుల్లితెరపై ముఖ్యంగా జబర్దస్త్ కార్యక్రమం లో అదిరిపోయే కామెడీ దొరుకుతుంది అని భావిస్తున్నారు. ఈ క్రమంలోనే ఎన్ని సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చే విడుదల అయినప్పటికీ కూడా కడుపుబ్బ నవ్వు కోడానికి జబర్దస్త్ కార్యక్రమాన్ని చేస్తున్నారు అందరు.

ఇక జబర్దస్త్ కార్యక్రమం ప్రస్తుతం టాప్ రేటింగ్ సొంతం చేసుకుంటూ దూసుకుపోతోంది. ప్రస్తుతం ఎన్నో కొత్త కామెడీ షోస్ వస్తున్నప్పటికీ జబర్దస్త్ షో ని బీట్ చేయలేకపోతున్నాయి అని చెప్పాలి. అయితే జబర్దస్త్ లో ఇప్పటి వరకు ఎంతో మంది కమెడియన్స్ బాగా గుర్తింపు సంపాదించారు. ఇలా గుర్తింపు సంపాదించిన వారిలో నరేష్ కూడా ఒకరు. ఎప్పుడూ తన పర్ఫార్మెన్స్ తో ప్రేక్షకులని కడుపుబ్బా నవ్విస్తూ ఉంటాడు నరేష్. జబర్దస్త్ లో ఉన్న అన్ని టీమ్ లలో కూడా కనిపిస్తూ అదరగొడుతు ఉంటాడు. అయితే గత కొంత కాలం నుంచి జబర్దస్త్ లో నరేష్ ఒక అమ్మాయికి లైన్ వేస్తున్నాడు అన్నది అర్ధమవుతుంది.

 ఇటీవలి కాలంలో మొన్నటి వరకు బుల్లితెర పై తన నటనతో అలరించిన షబీనా ఇక జబర్దస్త్ లో కూడా కనిపిస్తోంది. తన కామెడీ టైమింగ్ తో అలరిస్తోంది. తన అందం అభినయంతో ఎంతోమంది ఆకట్టుకుంటుంది. అయితే కెవ్వు కార్తిక్ స్కిట్ లో భాగంగా ఇటీవల షబీనా తో క్లోజ్  కావడానికి నరేష్ తెగ ప్రయత్నాలు చేస్తున్నాడు. స్కిట్స్ చేస్తున్న సమయంలో కాస్త అడ్వాంటేజ్ తీసుకోవడం లాంటివి కూడా చేశాడు. అంతేకాదు ఇక స్కిట్ చేస్తున్న సమయంలో లవ్ సాంగ్ వేయాలి అంటూ కోరుతున్నాడు. ఇదంతా చూస్తుంటే  జబర్దస్త్ నరేష్ షబీనా కి లైన్ వేస్తున్నాడు అన్నది అర్ధమవుతుంది. ఇటీవలే విడుదలైన ఎక్స్ ట్రా జబర్దస్త్ ప్రోమో లో కూడా వీరిద్దరి పర్ఫామెన్స్ హాట్ టాపిక్ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: